పంజాబ్‌: క్రికెటర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ సహా ఐదుగురిని రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’

Punjab AAP Nominates Five Members Along With Veteran Cricketer Harbhajan Singh For Rajya Sabha, AAP Nominates Five Members Along With Veteran Cricketer Harbhajan Singh For Rajya Sabha, Veteran Cricketer Harbhajan Singh For Rajya Sabha, Rajya Sabha, AAP Nominates Five Members For Rajya Sabha, Cricketer Harbhajan Singh For Rajya Sabha, Veteran Cricketer Harbhajan Singh, Harbhajan Singh For Rajya Sabha, Harbhajan Singh, Punjab, AAP, Aam Aadmi Party, Aam Aadmi Party Latest Updates, Aam Aadmi Party Latest News, AAP Nominates Veteran Cricketer Harbhajan Singh For Rajya Sabha, AAP Nominates Veteran Cricketer Harbhajan Singh, Cricketer Harbhajan Singh, Mango News, Mango News Telugu,

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో రాజ్యసభకు జరుగనున్న ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తోపాటు ఐఐటీ-ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ‘ఆప్’ వ్యూహకర్త సందీప్ పాఠక్‌, ‘ఆప్’ నాయకుడు రాఘవ్ చద్దా ఉన్నారు. నాలుగో నామినీగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్, ఐదవ నామినీగా లూథియానాకు చెందిన పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా ఎంపికయ్యారు. పంజాబ్‌లోని ఏడు స్థానాల్లో ఐదు స్థానాలకు మార్చి 31న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, నేడు (సోమవారం, మార్చి 21) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీలోని 117 సీట్లలో 92 స్థానాలను గెలుచుకున్న ఆప్‌కి మొత్తం ఐదు స్థానాలకు సరిపడా సభ్యులున్నారు. దీంతో ఆప్ ఐదు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.

ఐఐటీ-ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పాఠక్ కొన్నేళ్లుగా ఆప్ కోసం వ్యూహరచన చేస్తూ ఇటీవలి అద్భుతమైన విజయానికి పునాది వేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన పాఠక్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టీమ్‌లో బ్యాక్‌రూమ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజిందర్ నగర్ నుండి ఆప్ యొక్క ఢిల్లీ ఎమ్మెల్యే మరియు పంజాబ్‌లో పార్టీ కో-ఇంఛార్జి అయిన రాఘవ్ చద్దా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇక పంజాబ్ నుంచి ఆప్ అభ్యర్థిగా ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఉన్నారు. కాగా, పర్తాప్ సింగ్ బజ్వా మరియు SS దుల్లో (ఇద్దరూ కాంగ్రెస్ నుండి), శ్వైత్ మాలిక్ (BJP), నరేష్ గుజ్రాల్ (SAD) మరియు SS ధిండా ( SAD-సంయుక్త్) ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనున్నందున పంజాబ్‌లో ఐదు ఖాళీలు ఏర్పడుతున్నాయి. మిగిలిన రెండు సీట్లలో బల్వీందర్ సింగ్ భుందర్ (SAD), అంబికా సోని (కాంగ్రెస్) పదవీకాలం జూలై 4న ముగియనుంది. ఈ రెండు స్థానాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =