ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 ప్రారంభానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. డబ్ల్యూపీఎల్-2023 వేలం ఫిబ్రవరి 13న ముగిసిన నేపథ్యంలో బీసీసీఐ తాజాగా డబ్ల్యూపీఎల్-2023 షెడ్యూల్ను ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ వంటి 5 ఫ్రాంచైజీలు పాల్గొంటుండగా, 5 ఫ్రాంచైజీలు కలిపి వేలంలో 87 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 57 మంది భారత్ ఉమెన్ క్రికెటర్లు కాగా, 30 మంది విదేశీ ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు.
డబ్ల్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి 26 వరకు ముంబయిలో జరగనుంది. మొదటి సీజన్ మొత్తం 23 రోజుల వ్యవధిలో జరగనుండగా, 20 లీగ్ మ్యాచ్లు మరియు 2 ప్లేఆఫ్ గేమ్లను నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్లు కూడా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం (11 మ్యాచులు) మరియు డీవై పాటిల్ స్టేడియం (11 మ్యాచులు) లోనే జరగనున్నాయి. డబ్ల్యూపీఎల్-2023 మార్చి 4, శనివారం డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ తో ప్రారంభం కానుంది. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్ మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం డబ్ల్యూపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.
🗓️ Mark Your Calendars
Get Ready to support your favourite teams 👏 👏
The schedule for the inaugural edition of Women’s Premier League is here 🔽 #WPL pic.twitter.com/O1HHvRUh0k
— Women’s Premier League (WPL) (@wplt20) February 14, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE