ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం

AP Ex Minister and Former Deputy Speaker Gummadi Kuthuhalamma Passed Away,Gummadi Kuthuhalamma,Former AP minister Gummadi Kuthuhalamma,Former AP minister,Mango News,Mango News Telugu,Gummadi Kuthuhalamma AP Legislature,Kuthuhalamma Gummadi,Gummadi Kuthuhalamma Passed Away,Ex Minister Gummadi Kuthuhalamma,Kuthuhalamma,Former AP Minister Gummadi Kuthuhalamma Passed Away

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కాగా ప్రస్తుతం ఆమె వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం తిరుపతిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1949 జూన్‌ 1న ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించిన కుతూహలమ్మ ఎంబీబీఎస్ చేసి చిత్తూరు జిల్లాలో డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు. ఈ క్రమంలో 1979లో కుతూహలమ్మ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1980-1985 మధ్య చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుతూహలమ్మను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

అనంతరం 985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కుతూహలమ్మ 1991-93 మధ్య కాలంలో ఏపీ ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999-2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే 2007-09 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఆమె పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన కుతూహలమ్మ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే టీడీపీ తరపున 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఇక కుతూహలమ్మ మృతి పట్ల చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. అలాగే టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు మరియు కార్యకర్తలు సంతాపం తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + thirteen =