నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము

Draupadi Murmu, New Parliament Building, Parliament, Budget session, Budget Session 2024, PM Modi, President Murmu, Murmu not invited for new Parliament inauguration, Narendra Modi, President of India, Lok Sabha, Elections, Indian Political Updates, Mango News Telugu, Mango News
draupadi murmu, parliament, Budget session

జీవితంలో తొలిసారి దేశంలో పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నానని రాష్ట్రపది ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నూతన పార్లమెంట్ భవనంలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చారు. గతేడాది భారత్ ఎన్నో ఘనతలు సాధించిందని.. రక్షణ, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగాయని వివరించారు.

భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవని ముర్ము కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం ఎంతో గర్వకారణం అని.. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించదన్న ముర్ము.. ఇది భారతీయులందరికీ గర్వకారణమన్నారు. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను కూడా ఇస్త్రో విజయవంతంగా ప్రయోగించిందని పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి 107, పారా క్రీడల్లో 111 పతకాలను సాధించామని వివరించారు.

జీ-20 సమావేశాలను ఘనంగా నిర్వహించకున్నామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా.. నారీశక్తి వందన్ అధినియమ్‌ బిల్లును ఆమోదించుకున్నామని వివరించారు. తన చిన్నతనం నుంచి గరీబీ హఠావో నినాదం వింటున్నానన్న ముర్ము.. తొలిసారి దేశంలో పేదరిక నిర్మూలనను చేస్తున్నానని చెప్పుకొచ్చారు. గడిచిన 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా దేశం ముందుకెళ్తోందని చెప్పారు.

ఎన్నో ఆటంకాలను అధిగమించి.. శతాబ్దాలుగా కలగా మిగిలిపోయిన రామమందిరాన్ని నిర్మించుకున్నామని వివరించారు. యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారి సమయాల్లో కూడా ప్రజలపై భారం పడకుండా.. ద్రవ్యోల్భణాన్ని నియంత్రణలో కేంద్రం ఉంచిందని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామన్నారు. అలాగే కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే నాలుగు స్తంభాలపై దేశాభివృద్ధి ఆధారపడి ఉందని విశ్వసిస్తున్నామని ద్రౌపది ముర్ము వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =