తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌ కు ఆహ్వానపత్రం అందజేత

TTD Chairman YV Subba Reddy Invited CM YS Jagan for Tirumala Srivari Brahmotsavalu from SEP 27 to OCT 5, TTD Chairman YV Subba Reddy, YV Subba Reddy Invited CM YS Jagan, Tirumala Srivari Brahmotsavalu, TTD Brahmotsavalu, Srivari Brahmotsavalu, Tirumala Brahmotsavalu, AP CM YS Jagan Mohan Reddy , Mango News, Mango News Telugu, TTD, Tirumala Tirupati Devasthanam, TTD Latest News And Updates, Tirupati Brahmotsavalu, Brahmotsavalu

తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భక్తుల భాగస్వామ్యంతో తొమ్మిది రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, మాడ వీధుల్లో వాహన సేవల ఊరేగింపును నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కలిసి తిరుమలలో బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

బుధవారం శాసనసభలోని సీఎం కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తదితరులు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వాన పత్రం అందజేశారు. అలాగే వారు ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని కూడా సీఎంకు అందజేశారు. బ్ర‌హ్మోత్సవాల తొలిరోజు అనగా సెప్టెంబర్ 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం వైఎస్ జగన్ ప‌ట్టువ‌స్త్రాలు సమర్పించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =