బీరట్ లో భారీ పేలుళ్లు: 100 మంది మృతి, 4000 మందికి పైగా గాయాలు

100 People Died and More than 4000 Injured, beirut blast news, beirut blast news today, Beirut Blasts, Beirut explosion, Lebanon explosion, Massive Beirut blast, national news, national news today

లెబనాన్‌ రాజధాని బీరట్‌లో మంగళవారం నాడు భారీ పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. పోర్టు ఏరియాల్లో భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ ఉంచడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అక్కడి అధికారులు‌ వెల్లడించారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి దాకా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 4000 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ప్రభావం కొన్ని కిలో మీటర్ల వరకు ఉండడంతో ఎన్నో భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. భవన శిథిలాల కింద అనేకమంది చిక్కుకోవడంతో రక్షణ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పేలుళ్ల దాటికి ప్రజలు వణికిపోతూ, విధుల వెంట పరుగులు తీశారు. వేల టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను భద్రతా చర్యలు చేపట్టకుండా కొన్ని సంవత్సరాల నుంచి పోర్టు ప్రాంతంలో నిల్వ చేశారని, తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమైందని లెబనాన్ అధ్యక్షుడు మేఖేల్‌ ఔన్‌ వ్యాఖ్యానించారు.

లెబ‌నాన్ లోని బీరట్ న‌గ‌రంలో భారీ పేలుడు సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్య‌క్తం చేశారు. “బీరట్ ‌లో పెద్ద ఎత్తున పేలుడు సంభంవించి, ప్ర‌జ‌ల ప్రాణాలు కోల్పోవ‌డం, ఆస్తిన‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల షాక్ కు, బాధ‌కు గుర‌య్యాను. మ‌ర‌ణించిన‌ వారి కుటుంబాలు, గాయ‌ప‌డిన‌వారి చుట్టూనే మా ఆలోచ‌న‌లున్నాయి, వారికోసం ప్రార్థిస్తున్నామని” ప్రధాని మోడీ సందేశం విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =