పశ్చిమబెంగాల్లో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి, టీఎంసీ కార్యకర్తల పనేనని మంత్రి ఆరోపణ

Union Minister V Muraleedharan's Convoy Attacked in West Bengal,Mango News,Mango News Telugu,Union Minister V Muraleedharan,Minister V Muraleedharan,V Muraleedharan,V Muraleedharan News,Union Minister V Muraleedharan Latest News,West Bengal,Attack On Union Minister V Muraleedharan's Convoy,Union Minister V Muraleedharan Convoy Attacked,V Muraleedharan In Bengal,Attack On Convoy Of Union Minister V Muraleedharan,Attack On Union Minister V Muraleedharan Convey,V Muraleedharan Car Attacked,Attack On V Muraleedharan Car,Union Minister V Muraleedharan's Convoy Attacked,Union Minister V Muraleedharan Convoy,Bengal Violence,Violence In West Bengal

కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు వి.మురళీధరన్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పాంచకుడి ప్రాంతంలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా కేంద్రమంత్రి వి.మురళీధరన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ టీఎంసీ కార్యకర్తలే తన కాన్వాయ్ పై దాడి చేసినట్లు ఆరోపించారు.

“వెస్ట్ మిడ్నాపూర్‌ లో నా కాన్వాయ్‌పై టీఎంసీ గూండాలు దాడి చేశారు, కిటికీలు పగలగొట్టారు, వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారు. నా పర్యటను ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితాలు అనంతర జరిగిన హింసలో మరణించిన బీజేపీ కార్యకార్త బిస్వాజిత్ మహేష్ ఇంటిని మేము సందర్శించలేకపోయాము. పాంచకుడి వద్ద నా కాన్వాయ్‌పై దాడి తర్వాత ముందుకు వెళ్లవద్దని పోలీసులు మాకు సలహా ఇచ్చారు” అని కేంద్రమంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. మరోవైపు ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చోటుచేసుకుంటున్న పలు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లపై కేంద్రం హోమ్ శాఖ నివేదిక కోరింది. హింస ఘటనలపై నివేదిక సమర్పించాలని బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ను ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =