దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి పైగా వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Telangana Cyberabad Police Arrest Six Online Fraudsters Who Stolen 16 Cr People Personal Data Across India,Police Arrest Six Online Fraudsters,Telangana Police on Who Stolen 16 Cr People Personal Data,People Personal Data Across India Stolen,Telangana Cyberabad Police,Mango News,Mango News Telugu,Telangana Crime News,Cyberabad Police Bust Gang Stealing Data,Telangana Cyberabad Police Latest News,Telangana Online Fraudsters News Today,Telangana Crime News Updates

భారతదేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. కాగా ఈ ముఠా సామాన్య ప్రజల యొక్క ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంకు వివరాలను కొట్టేసి ఆ డేటాను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ కేసును పోలీసులు ఛేదించారు. అనంతరం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్ల మందికి సంబంధించిన వ్యక్తి గత డేటాను ఈ ముఠా చోరీ చేసిందని, ఆధార్, పాన్‌కార్డ్, బ్యాంకు అకౌంట్‌లకు సంబంధించిన పూర్తి డేటాను దొంగిలించిందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డేటాతో పాటు పలు బ్యాంక్‌ల క్రెడిట్ కార్డుల డేటా, పాలసీ బజార్ వంటి పేరున్న ఆర్గనైజేషన్ల నుంచి డేటాను చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైందని, అలాగే కోట్లాదిగా సోషల్‌ మీడియా ఐడీలు, పాస్‌వర్డ్‌లు కూడా లీకయ్యాయని వెల్లడించారు. ఇంకా ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైందని తెలియజేశారు. ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌కార్డులు, లోన్‌ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారని, వీరికి ఆయా కంపెనీల్లోని కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారని వివరించారు. ఈ విధంగా చోరీ చేసిన డేటాను ఈ ముఠా అధిక మొత్తంలో డబ్బుకు అమ్ముకుంటోందని, ప్రముఖంగా నాగపూర్, ఢిల్లీ, ముంబై స్థావరాలుగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా చోరీకి పాల్పడ్డ నిందితులను గుర్తించామని, సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =