ఢిల్లీ లిక్కర్ స్కామ్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద జారీ కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహీ పేరు మీద నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 6న హైదరాబాద్ లోని కార్యాలయం లేదా ఢిల్లీ లోని కార్యాలయం ఎక్కడైనా సరే ఆమె విచారణకు రావొచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ కవిత సీబీఐ నోటీసులపై స్పందిస్తూ.. తనకు నోటీసులు అందాయని స్పష్టం చేశారు. డిసెంబర్ 6న హైదరాబాద్ లోని తన ఇంట్లోనే వివరణ ఇస్తానని అధికారులకు తెలియజేశానని కూడా ఆమె వెల్లడించారు. అయితే సెక్షన్‌ 160 కింద ఇచ్చేవి సమన్లు కాదని, కేవలం అనుమాన నివృత్తి కోసం ఇచ్చే నోటీసులు మాత్రమేనని కవిత వర్గీయులు వెల్లడిస్తున్నారు.

కాగా ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరా విచారణలో భాగంగా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరుని చేర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని, ఏజెన్సీలు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తే కచ్చితంగా సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. కానీ మీడియాకు సెలెక్టివ్ లీక్స్ ఇవ్వడం ద్వారా నాయకుల ఇమేజ్‌లను దిగజార్చడం వల్ల ప్రజలు దానిని తిప్పికొడతారని, ఈడీ, సీబీఐలను ఉపయోగించి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. కావాలంటే తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకోవచ్చని, ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించి అధికారంలోకి రావాలని కేంద్రం లోని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని, అయితే వారి ఆటలు తెలంగాణలో సాగవని గుర్తెరగాలని కవిత సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 1 =