పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, బీహార్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్

By-Elections West Bengal Chhattisgarh Bihar Maharashtra Voting Underway, By-Elections Of West Bengal Voting Underway, By-Elections Of Chhattisgarh Voting Underway, By-Elections Of Bihar Voting Underway, By-Elections Of Maharashtra Voting Underway, By-Elections, By-Elections Voting Underway, Bypolls, Bypolls Voting Underway, By-elections 2022, 2022 By-elections, Polling Commences For By-Elections In West Bengal, Polling Commences For By-Elections In Chhattisgarh Bihar And Maharashtra, Voting underway for bye-polls, By-elections 2022 News, By-elections 2022 Live, By-elections 2022 Latest News, By-elections 2022 Latest Updates, By-elections 2022 Live Updates, West Bengal By Elections, Chhattisgarh By Elections, Bihar By Elections, Maharashtra By Elections, Mango News, Mango News Telugu,

పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, బీహార్ రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో అసన్సోల్ లోక్‌సభ స్థానంలో, బల్లిగంజ్ అసెంబ్లీ స్థానంలో మరియు మహారాష్ట్రలో నార్త్ కొల్హాపూర్, బీహార్ లో బోచాహన్, ఛత్తీస్ గడ్ లో ఖైరాఘర్ అసెంబ్లీ స్థానాల్లో నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అసన్సోల్, బల్లిగంజ్ స్థానాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఈ రెండు చోట్ల పలు ప్రదేశాలను సున్నితమైనవిగా గుర్తించి బూత్‌లు వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఓటింగ్ జరుగుతున్న అసన్సోల్ లోక్‌సభ పరిధిలో పలు చోట్ల హింస చెలరేగింది. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ తన కాన్వాయ్‌పై టీఎంసీకి చెందిన వ్యక్తులు రాళ్లు విసిరారని, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

అసన్సోల్ లో టీఎంసీ అభ్యర్థిగా వెటరన్ నటుడు శత్రుఘ్న సిన్హాను పోటీలో ఉండగా, బీజేపీ నుంచి అగ్నిమిత్ర పాల్‌ బరిలో ఉన్నారు. ఇక బల్లిగంజ్ లో టీఎంసీ నుంచి మాజీ కేంద్రమంత్రి బాబూలాల్ సుప్రియో మరియు బీజేపీ నుంచి కీయా ఘోష్ పోటీలో ఉన్నారు. కాగా ఈ నాలుగు రాష్ట్రాల్లోని ఉపఎన్నికల కౌంటింగ్ పక్రియను ఏప్రిల్ 16న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =