తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొక్కిసలాట.. 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh TTD Cancels VIP Break Darshan at Tirumala For Next 5 Days, VIP Break Darshan Cancelled For 5 Days, TTD cancels VIP break darshan at Tirumala, Tirumala Tirupati Devasthanam, VIP Break Darshan, Tirumala Tirupati Devasthanam Cancels VIP Break Darshan at Tirumala For Next 5 Days, TTD cancels VIP break darshan, Andhra Pradesh TTD Cancels VIP Break Darshan at Tirumala, VIP Break Darshan News, VIP Break Darshan Latest News, VIP Break Darshan Latest Updates, VIP Break Darshan Live Updates, TTD Cancels VIP Break Darshan For Next 5 Days, TTD, Mango News, Mango News Telugu,

ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దిగువ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. దగ్గర తోపులాట జరిగింది. దీంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయాలపాలు కాగా చికిత్స నిమిత్త రుయా ఆస్పత్రికి తరలించారు. అధికారులు కూడా ఊహించనంత భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి విచ్చేశారు. తిరుపతిలో మొత్తం మూడు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లను జారీ చేశారు. గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల దగ్గర టీటీడీ టోకెన్లను జారీ చేసింది. అయితే భక్తులు పెద్ద ఎత్తున హాజరవటంతోపాటు ఎండలో క్యూ లైన్లలో నిలబడి ఉండాల్సి రావడం వలన భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎవరికివారు త్వరగా వెళ్లాలన్న తొందరలో గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. గోవిందరాజస్వామి సత్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. రెండు రోజుల విరామం తర్వాత సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న నేపథ్యంలో.. టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో అందుబాటులో ఉన్న టీటీడీ పాలకమండలి సభ్యులు హుటాహుటిన సమావేశమయ్యారు. అధికారుల సూచనల మేరకు కీలక నిర్ణయికొచ్చారు. భక్తుల రద్దీ కారణంగా రేపటినుంచి తర్వాతి 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. టోకెన్లతో అవసరం లేకుండానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చింది. అలిపిరి నుంచి దర్శన టోకెన్లు లేకపోయినా కొండపైకి రావడానికి అనుమతి ఇచ్చారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లలోకి రెండేళ్ల తర్వాత భక్తులను టీటీడీ అనుమతించింది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − five =