కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, టిక్‌టాక్‌ సహా 59 యాప్స్ పై నిషేధం

#TikTokban, 59 Chinese apps, Ban on TikTok App, Central Govt Bans 59 Chinese apps, Central Govt Bans 59 Chinese apps Including TikTok, Central Govt Bans Chinese apps, Chinese Mobile Apps, Indian Government Bans 59 Apps, Prime Minister Narendra Modi, TikTok, TikTok App Ban, TikTok app removed, TikTok Ban, TikTok Ban In India

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా వస్తువులను నిషేదించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అలాగే చైనా దేశానికి సంబంధించిన పలు యాప్స్ సురక్షితం కాదని ఇటీవలే భారత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. ఈ క్రమంలో దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్టిలో ఉంచుకుని 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం నిషేదించిన 59 యాప్స్ జాబితా ఇదే:

1. టిక్‌టాక్
2. షేర్ ఇట్
3. క్వాయ్
4. యూసీ బ్రౌజర్
5. బైడు మ్యాప్
6. షెయిన్
7. క్లాష్ ఆఫ్ కింగ్స్
8. డీయూ బ్యాటరీ సేవర్
9. హలో
10. లైక్
11. యూకామ్ మేకప్
12. ఎంఐ కమ్యూనిటీ
13. సిఎం బ్రోవర్స్
14. వైరస్ క్లీనర్
15. ఏపీయూఎస్‌ బ్రౌజర్
16. రోమ్‌వే
17. క్లబ్ ఫ్యాక్టరీ
18. న్యూస్‌డాగ్
19. బ్యూట్రీ ప్లస్
20. వీచాట్
21. యూసీ న్యూస్
22. క్యూక్యూ మెయిల్
23. వీబో
24. జెండర్
25. క్యూక్యూ మ్యూజిక్
26. క్యూక్యూ న్యూస్‌ఫీడ్
27. బిగో లైవ్
28. సెల్ఫీసిటీ
29. మెయిల్ మాస్టర్
30. పారలల్ స్పేస్
31. ఎంఐ వీడియో కాల్ – షియోమి
32. వి సింక్
33. ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్
34. వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్‌,
35. మైటు
36. విగో వీడియో
37. న్యూ వీడియో స్టేటస్
38. డీయూ రికార్డర్
39. వాల్ట్ – హైడ్
40. క్యాచీ క్లియర్‌ డియూ యాప్స్‌ స్టూడియో
41. డీయూ క్లీనర్
42. డీయూ బ్రౌజర్
43. హగో ప్లే విత్ న్యూ ఫ్రెండ్స్
44. కామ్ స్కానర్
45. క్లీన్ మాస్టర్ – చిటా మొబైల్
46. ​​వండర్ కెమెరా
47. ఫోటో వండర్
48. క్యూక్యూ ప్లేయర్
49. వీమీట్
50. స్వీట్ సెల్ఫీ
51. బైడు ట్రాన్స్ లేట్
52. వీ మెట్
53. క్యూక్యూ ఇంటర్నేషనల్
54. క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్
55. క్యూక్యూ లాంచర్
56. యూ వీడియో
57. వీ ఫ్లై స్టేటస్ వీడియో
58. మొబైల్ లెజెండ్స్
59. డీయూ ప్రైవసీ

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 12 =