అన్‌లాక్‌ -2: కంటైన్మెంట్ జోన్స్ లో జూలై 31 వరకు లాక్‌డౌన్, కీలక మార్గదర్శకాలు విడుదల

Central Govt Extends Lockdown, Central Govt Extends Lockdown in Containment Zones, Containment Zones, Containment Zones List, Containment Zones Lockdown, India Lockdown, India Lockdown News, India Unlock 2.0, Unlock 2.0, Unlock 2.0 News

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై‌ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించి జూన్ 30, సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత మార్గదర్శకాలను ప్రకటించింది.

అన్‌లాక్‌ 2.0 లో అనుమతి లేనివి – (జూలై 31 వరకు నిషేధం):

  • కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినవి మినహా ప్రయాణీకుల అంతర్జాతీయ విమాన ప్రయాణం
  • మెట్రో రైళ్లు
  • సినిమా థియేటర్స్
  • జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, బార్‌లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్ళు
  • సామాజిక రాజకీయ/ క్రీడలు / వినోదం / విద్యా / సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు, బహిరంగ సభలు

కేంద్ర ప్రకటించిన ఇతర మార్గదర్శకాలు :

–> రాత్రి పూట కర్ఫ్యూ: రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
–> కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న శిక్షణా సంస్థలు జూలై 15 నుంచి ప్రారంభించేందుకు అనుమతి.
–> బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ప్రయాణ సమయంలో ముఖానికి మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
–> దుకాణదారులు, వ్యాపారాలు కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి.
–> గుంపులు గుంపులుగా జనం గుమికూడడంపై నిషేధం.
–> వివాహ, ఇతర సంబంధిత కార్యక్రమాలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి.
–> అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి.
–> కార్యాలయాలు, ఎక్కువ మంది సంచరించే ప్రాంతాలను శానిటైజషన్‌ చేయాలి.
–> బయట ప్రదేశాల్లో 6 ఆరడుగుల తప్పనిసరి భౌతికదూరం పాటించాలి.
–> బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.
–> కేంద్ర, రాష్ట్ర విధివిధానాలను అన్ని సంస్థలు పాటించాలి, ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 14 =