నేటి నుంచే కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో’ యాత్ర.. తండ్రి రాజీవ్ గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించిన రాహుల్

Congress Bharat Jodo Yatra Starts From Today Rahul Visits Rajiv Gandhi Memorial Before The Launch, Rahul Visits Rajiv Gandhi Memorial, Rahul Gandhi To Launch Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra Starts Today, Mango News, Mango News Telugu, Rajiv Gandhi Memorial, Rahul Gandhi Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra Live Updates, Rahul Gandhi Latest News And Updates, Congress Party

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం తేవడానికి, అలాగే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తేవడానికై ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం తమిళనాడు లోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ దీనిని నేడు ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను ఆయన ముందుండి నడిపించనున్నారు. ఈ క్రమంలో 150 రోజుల పాటు జరుగనున్న ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల మీదుగా కొనసాగనుంది. కాగా ఈ యాత్ర ఆసాంతం రాహుల్ వెంట 119 మంది సీనియర్‌ నేతలు అడుగులు కలపనున్నారు. ఈ నేపథ్యంలో.. రాహుల్‌ గాంధీ నిన్న రాత్రే ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీపెరుంబుదూరులోని ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ స్మారక స్థలానికి చేరుకుని నివాళులర్పించారు.

కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో’ యాత్ర ఇలా కొనసాగనుంది..

  • రాహుల్ గాంధీ విమానంలో తిరువనంతపురం చేరుకుని, అక్కడి నుండి హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకుంటారు.
  • ముందుగా సాయంత్రం బహిరంగ సభ నిర్వహించి, కాంగ్రెస్ ఈ జోడో యాత్ర చేపట్టడానికి గల కారణాలను వివరించి పాదయాత్రను ప్రారంభిస్తారు.
  • నేటి కార్యక్రమానికి మిత్రపక్షం డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, ఆ పార్టీ సీనియర్‌ నేతలు హాజరవనున్నారు.
  • కాగా ప్రతి రోజూ యాత్ర రెండు జట్లుగా సాగనుండగా, ఉదయం 7-10.30 మధ్య ఒక జట్టు, సాయంత్రం 3.30-6.30 మధ్య రెండో జట్టు యాత్రలో పాల్గొంటాయి.
  • రాహుల్‌ వెంట నడిచేవారిని 3 రకాలుగా వర్గీకరించారు. దీని ప్రకారం భారత్‌ యాత్రీలు, స్థానిక కార్యకర్తలను ప్రదేశ్‌ యాత్రీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనే వారిని అతిథి యాత్రీలుగా వ్యవహరించనున్నారు.
  • ప్రతి రోజూ దాదాపు 22-23 కి.మీ. వరకు పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ రూపొందించారు.
  • ఈ క్రమంలో ఈ నెల 11న కేరళలో ప్రవేశించే ఈ యాత్ర ఆ రాష్ట్రంలో దాదాపు 18 రోజులపాటు కొనసాగనుంది.
  • అనంతరం 30వ తేదీ నాటికి కర్ణాటక చేరుకొని అక్కడ 21 రోజుల పాటు సాగనుంది.
  • ఇలా కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్‌, మైసూరు, బళ్లారి, రాయచూరు, వికారాబాద్‌, నాందేడ్‌, జల్గావ్‌, ఇండోర్‌, కోట, దౌసా, ఆల్వార్‌, బులంద్‌ శహర్‌, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్‌, జమ్మూ మీదుగా కొనసాగి చివరగా శ్రీనగర్‌ చేరుకుంటుంది.
  • కాగా ఈ యాత్రలో పాల్గొనేందుకు దాదాపు 50,000 మంది పేర్లు కూడా నమోదు చేయించుకోవడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =