తెలంగాణాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస-బీజేపీ మధ్య మాటల మంటలు

తెలంగాణలో బియ్యం సేకరణ అంశంపై గత కొన్నిరోజులుగా తెరాస, బీజేపీ పార్టీలు వాడి, వేడి విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ దీనిపై కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రంపై అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవటానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్న పీయూష్ గోయల్.. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు. అలాగే, ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని స్పష్టం చేశారు.

అలాగే, రా రైస్‌ ఎంత ఇచ్చినా కేంద్రం కొనుగోలు చేస్తుందని గతంలోనే స్పష్టంచేశామని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. కానీ, దీనిపై సీఎం కేసీఆర్ అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామని అయినా ఇంకా కేంద్రంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎందుకు ఎఫ్‌సీఐకి తరలించలేదని గోయల్ ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ మూడు రెట్లు పెరిగిందన్న ఆయన.. రైతులకు ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చి, నేను కలవటం లేదని విమర్శించటం తెరాస నాయకులకు తగదన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 7 =