ఏపీలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేటినుంచి ప్రారంభం

AP CM YS Jagan Launches Jagananna Sampoorna Gruha Hakku Scheme, AP CM YS Jagan Launches Jagananna Sampoorna Gruha Hakku Scheme Today, AP Government, AP Government Schemes, AP Schemes, Jagan launch OTS in WG projects in Kadapa, Jagan to launch OTS, Jagananna Sampoorna Gruha Hakku, Jagananna Sampoorna Gruha Hakku Scheme, Mango News, Mango News Telugu, Sampoorna Gruha Hakku Scheme, YS Jagan Launch Jagananna Sampoorna Gruha Hakku Scheme, YS Jagan Launches Jagananna Sampoorna Gruha Hakku Scheme

ఈరోజు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా పేదప్రజలకు సొంతింటి కల నెరవేరుస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. మొత్తంగా 50 లక్షల మంది కుటుంబాలకు లబ్ది జరుగనుంది. ఇల్లు అంటే కేవలం ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం మాత్రమే కాదు. జీవితకాలం పడిన కష్టానికి ప్రతిరూపమే ఇల్లు. ఇప్పటికి 26వేల కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశాము. 52లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ అక్షరాలా రూ.లక్షా 58వేల కోట్లు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీ చేశాము. రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు ఇచ్చాము, అని సీఎం జగన్ చెప్పారు.

ఏప్రిల్‌ 2 వరకు ఓటీఎస్‌ పథకం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పేద ప్రజలందరూ దీనిద్వారా లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగానే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వచ్చే సంవత్సరం ఉగాది వరకు పొడిగిస్తున్నాం అని సీఎం జగన్‌ అన్నారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను, వడ్డీని మాఫీచేసి, సర్వ హక్కులతో వారికి రిజిస్ట్రేషన్‌ చేయించేదే ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ అని జగన్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్‌ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్‌ పట్టాలను అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =