రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ధర ఒక్కో డోసుకు రూ.400 : భారత్ బయోటెక్

Bharat Biotech Reduces Covaxin Cost from Rs 600 to Rs 400 Per Dose for States,Mango News,Mango News Telugu,Bharat Biotech Reduces Covaxin Cost from Rs 600 to Rs 400,Bharat Biotech,Bharat Biotech News,Bharat Biotech Latest News,Covaxin Cost,Covaxin,Bharat Biotech Reduces Covaxin Cost from Rs 600 to Rs 400 Per Dose,Bharat Biotech Reduces Covaxin Cost,Bharat Biotech Reduces Covaxin Cost News,Bharat Biotech Reduces Covaxin's Price to Rs 400 per Dose,Bharat Biotech Reduces Covaxin Price For States,Bharat Biotech Cuts Covaxin Price To Rs 400 Per Dose For States,Covaxin Price Reduced To Rs 400 Per Dose For States,Covaxin Price

భారత్ బయోటెక్ సంస్థ తమ కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ ధర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ ను ఒక్కో డోసును రూ.400 కు అందించనున్నారు. “ఈ సమయంలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన మహమ్మారి పరిస్థితులపై భారత్ బయోటెక్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థకు ఉన్న అపారమైన సవాళ్లను గుర్తించి కోవాక్సిన్‌ వ్యాక్సిన్ ను ఒక్కో డోసుకు రూ.400 చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచుతున్నాము”అని భారత్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ముందుగా కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.600 చొప్పున మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు రూ.1200 చొప్పున విక్రయించనున్నట్టు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. అయితే రాష్ట్రాలకు, కేంద్రానికి వ్యాక్సిన్ అందించే ధరల్లో వత్యాసం ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం వ్యాక్సిన్‌ ధరలు తగ్గించాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వాలకు వ్యాక్సిన్ ధర తగ్గింపుపై భారత్ బయోటెక్ నుంచి ప్రకటన వెలువడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =