తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మరో 10 రోజులు పొడిగింపు

Lockdown Extension in Telangana, Lockdown in Telangana extended by 10 days, Mango News, Relaxation Time 6 AM To 6 PM, Telangana extends lockdown, Telangana Extends Lockdown For 10 More Days, Telangana Govt Decides to Continue Lockdown, Telangana Govt Decides to Continue Lockdown for Another 10 Days, Telangana govt extends Covid lockdown, Telangana govt extends Covid lockdown by 10 days, Telangana Govt Extends Lockdown, Telangana govt extends lockdown for 10 more days, Telangana Govt Extends Lockdown for Another 10 days, Telangana lockdown cabinet meeting

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ను జూన్ 10 నుంచి మరో పదిరోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్‌డౌన్‌ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనగా గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది. కాగా కరోనా పూర్తిగా అదుపులోకిరాని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్‌డౌన్‌ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధస్థితినే కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 9 =