సెప్టెంబర్ 5 వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం

Chidambaram CBI custody Extends, Chidambaram CBI custody Extends Till Sept 5, Chidambaram INX Media Case, Chidambaram INX Media Case Live Updates, Chidambarams CBI custody Extends Till Sept 5, Congress Leader P Chidambaram INX Media Case, Congress Leader P Chidambaram INX Media Case Live Updates, Enforcement Directorate, Former Finance Minister of India, INX Media case Live, Mango News Telugu

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి సీబీఐ విచారణ ఎదురుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 5 వరకు కస్టడీని కొనసాగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సీబీఐ కోర్టుకు వాదనలు వినిపిస్తూ, చిదంబరం కస్టడీ తమకు ఇంకా అవసరం లేదని ఆయనను తీహార్ జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేసారు.

వాదనలు విన్న అత్యుత్తమ న్యాయస్థానం సీబీఐ విజ్ఞప్తికి నిరాకరిస్తూ, సెప్టెంబర్ 5 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉంటారని, 5వ తేదీన బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాల్సి ఉందని చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సెప్టెంబర్ 5న ట్రయల్ కోర్టు విచారిస్తుందని, బెయిల్ పై ట్రయల్ కోర్టు నిర్ణయం తరువాత తదుపరి విచారణ కొనసాగిస్తామని, అప్పటివరకు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించవద్దని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

 

[subscribe]
[youtube_video videoid=UQTRIC1L9CY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =