కరోనా విజృంభణ: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌, ఇంట్లో ఒక్కరే బయటకు వచ్చేందుకు అనుమతి

China Puts 4 Lakh People Under Lockdown In Beijing Amid New COVID-19 Cases

కరోనా వైరస్ చైనాలో‌ మరోసారి విజృంభిస్తోంది. దీంతో రాజధాని బీజింగ్‌ సమీప ప్రాంతాలలో ఆదివారం నాడు లాక్‌డౌన్‌ విధించారు. బీజింగ్‌ తో పాటు హెబెయ్‌ ప్రావిన్స్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ పరిధిలో 150 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలలో పూర్తిగా కార్యకలాపాలు ఆపేసి
నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా లాక్‌డౌన్‌ ఆంక్షల పరిధిలోకి వచ్చారు. కొన్ని నెలల క్రితం కరోనా నియంత్రణకు వుహాన్ సిటీలో అమలు చేసిన కఠిన నిబంధనలనే ఇక్కడ కూడా అమలు చేయనున్నామని అధికారులు వెల్లడించారు. అలాగే పుడ్, మెడిసిన్స్, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ఒక కుటుంబం నుంచి రోజుకు ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =