అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం చేసిన చైనా

Arunachal Pradesh, arunachal pradesh china border, Arunachal Pradesh places rename, China, China issues official names for 15 places in Arunachal Pradesh, china map, China renames 15 places in Arunachal Pradesh, China Renames 15 Places of Arunachal Pradesh, China Renames 15 Places of Arunachal Pradesh in its Map, India dismisses China’s move to rename 15 places, Mango News, Mango News Telugu, renames 15 places in Arunachal Pradesh, who renamed nefa as arunachal pradesh

భారత్ పై మరోసారి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 15 ప్రాంతాలకు ‘చైనీస్- టిబెటన్’ అని నామకరణం చేసింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక తీర్మానం చేసింది. “ఇది మన సార్వభౌమాధికారం. చరిత్ర ఆధారంగా తీసుకున్న చర్య. ఇది చైనా హక్కు” అని పేర్కొంది. వాస్తవానికి, చైనా దక్షిణ టిబెట్‌ను తన భూభాగంగా చెప్పుకుంటుంది. భారత్ తన టిబెట్ భూభాగాన్ని విలీనం చేసి అరుణాచల్ ప్రదేశ్‌గా మార్చిందని ఆరోపనులు చేస్తుంటుంది. 2017లో కూడా చైనా ఇలాంటి పనే చేసింది.. అప్పట్లో 6 ప్రదేశాల పేర్లను మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది.

చైనా అధికారిక వార్తాపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకారం.. గురువారం, చైనా మంత్రివర్గం 15 పేర్ల మార్పులను ఆమోదించింది. ఈ ప్రాంతాలన్నీ చైనా దక్షిణ రాష్ట్రమైన షిజియాంగ్‌లో భాగం పరిధిలోకి వస్తాయి. వీటిలో 8 నివాస ప్రాంతాలు. నాలుగు పర్వత ప్రాంతాలు, రెండు నదులు.. ఒక పర్వత మార్గం ఉన్నాయి. టిబెట్ వ్యవహారాలపై చైనా నిపుణుడు లియన్ జియాంగ్మిన్ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. ఈ ప్రదేశాలు వందల సంవత్సరాలుగా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు సరిచేశారు. దీని ద్వారా సరిహద్దుల రక్షణ మరింత మెరుగ్గా మెరుగుపడుతుంది.

అయితే, దీనిపై భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. పేర్లు మార్చినంత మాత్రాన నిజం మారదు. చైనా తన కుసంస్కారాన్ని మరోసారి చాటుకుంది. ఇలాంటి చర్యల వలన భారత్ స్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది అని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + four =