పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు..నివేదిక చెప్పిన నిజం

Women are living longer than men the report Says,Women are living longer,living longer than men,the report Says living longer,Mango News,Mango News Telugu,Men are dying first,Women are living longer than men, Women ,Women are living longer,Why Females Live Longer Than Males, men, longer Life, Death,Women are living longer Latest News,Women are living longer Latest Updates
Men are dying first,Women are living longer than men, Women , men, longer Life, Death,

ఈ భూమ్మీద ప్రాణమున్న ప్రతి జీవికి చావు ఉంటుంది. కాకపోతే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో.. ఎవరి ప్రాణాలు ముందు పోతాయో..ఎవరు ఎలా మృత్యువాత పడతారో ఎవ్వరం చెప్పలేం.  అయితే అనుకోని మరణాలు కాకుండా నేచురల్ డెత్‌ పురుషులలో, మహిళలలో ఎలా ఉంటుందనే దానిపై తాజాగా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాలం బతుకుతున్నారట. 60 ఏళ్లు పైబడిన మహిళలలో ఈ తేడా ఎక్కువగా కనిపిస్తోందని  ఈ అధ్యయనం చెబుతోంది.

కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, మహిళలు పురుషుల కంటే ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.సాధారణంగా ఏ ఇంట్లో అయినా భర్త ఇంట్లో ఏ పనుల కోసం అయినా భార్యమీదే ఆధారపడతాడు. చిన్నచిన్న పనులు సొంతంగా చేసుకోలేక ప్రతీ పని భార్య చేయాలని కోరుకుంటాడు. అయితే ఇలాంటపుడు భార్య చనిపోతే భర్తకు ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్లు అయిపోతుంది. ఏ పని ఎలా చేయాలో తెలియక అయోమయంలో పడిపోతాడు.అయితే  అదే కుటుంబంలో  భర్త చనిపోతే.. కష్టాలన్నీ మింగుకుని జీవితాన్ని గడిపే శక్తి భార్యకు ఉంటుంది.అందుకే  మానసికంగా బలంగా ఉండే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారని ఈ సర్వే మళ్లీ రుజువు చేసినట్లు అయింది.

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. రాజస్థాన్, హర్యానా,  కేరళ,  గుజరాత్, ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్,  జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో.. ఐక్యరాజ్యసమితి భారతదేశ వృద్ధాప్య నివేదిక 2023 ప్రకారం, 60 ఏళ్ల వయస్సు గల మహిళల ఆయుర్దాయం 20 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

60 సంవత్సరాలు పైబడిన జనాభాతో పాటు.. వారి సామాజిక,ఆర్థిక స్థితిగతులపై సర్వేను నిర్వహించారు. భారతదేశంలో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు.. సగటున 18.3 సంవత్సరాలు జీవించగలరట. ఆ లెక్కన  60 సంవత్సరాలు పైబడిన స్త్రీలు 19 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తారట. అదే పురుషుల జీవితకాలం చూస్తే..సగటున 17.5 సంవత్సరాలు ఎక్కువ. అంటే పురుషులతో పోలిస్తే స్త్రీలు ఏడాదిన్నర ఎక్కువ కాలం జీవిస్తారట.మరోవైపు 2050 నాటికి, వృద్ధుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందట. వృద్ధుల సంఖ్య 20 శాతానికి పెరుగుతుందట.

అంతేకాదు మధ్యప్రదేశ్‌లో మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు  అధ్యయనం తేల్చింది. మధ్యప్రదేశ్‌లో మహిళల ఆయుర్దాయం  61 ఏళ్ల నుంచి 67 ఏళ్లకు పెరిగినట్లు  సర్వే చెప్పింది. అయితే 25 ఏళ్ల క్రితం ఇక్కడ మహిళల కంటే పురుషులే ఎక్కువ కాలం జీవించేవారట. కానీ అది ఇప్పుడు తలకిందులైంది. మధ్యప్రదేశ్ మహిళలు పెద్దగా ఒత్తిడి తీసుకోరని..అదే వారి ఆయుష్షు పెరగడానికి కారణమని కూడా సర్వే తేల్చి చెప్పింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − twelve =