ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ సమావేశం

Congress President, Congress President Sonia Gandhi, Congress President Sonia Gandhi to Chair Virtual Meeting of Opposition Parties Today, Mango News, Sonia Gandhi, Sonia Gandhi to chair meeting of opposition parties, Sonia Gandhi to chair Opposition parties, Sonia Gandhi To Chair Virtual Meet, Sonia Gandhi to Chair Virtual Meeting of Opposition Parties, Sonia Gandhi to meet leaders of opposition parties virtually, Sonia Gandhi Virtual Meeting of Opposition Parties

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం పలు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. వర్చువల్‌ గా జరగనున్న సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటుగా పలువురు కీలక నాయకులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు, కరోనా వ్యాక్సినేషన్, ఇంధన ధరల పెంపు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరు, వ్యవసాయ చట్టాలు, దేశ ఆర్ధిక పరిస్థితి, విపక్షాల ఐక్యత, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడం వంటి అంశాలపై చర్చించి అన్ని ప్రతిపక్ష పార్టీల తరపున ఉమ్మడి తీర్మానం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్ సమావేశాల అనంతరం ప్రతిపక్షపార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here