కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక: ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక మరియు అభ్యర్థులు ఖర్గే, థరూర్ తదితరులు

Congress Presidential Elections Sonia Gandhi Rahul Priyanka Along with Candidates Kharge and Tharoor Casted Their Votes, Congress President Election, Sonia Gandhi Rahul Priyanka Voted , Candidates Kharge Sashi Tharoor, Mango News, Mango News Telugu, Aicc President, TPCC's Key Decision, Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, TPCC Congress President, TPCC Decision on Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Mallikarjun Kharge

రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఓటు వేశారు. ఓటింగ్ ప్రారంభం అయిన కొద్దిసేపటి తర్వాత కార్యాలయానికి చేరుకున్న వీరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా 1998 నుండి 2017 వరకు మరియు 2019 నుండి 20 సంవత్సరాలకు పైగా పదవిలో కొనసాగిన సోనియా గాంధీ పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన అధ్యక్షురాలుగా ఘనత వహించారు. అయితే ఈసారి గాంధీ కుటుంబానికి చెందిన ఎవరూ అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు. 2024లో భారతీయ జనతా పార్టీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీని కొత్త శక్తితో నడిపించేందుకు 22 ఏళ్ల తర్వాత గాంధీయేతర అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీ పడుతున్నారు.

ఇక కర్ణాటకలోని బళ్లారిలో భారత్ జోడో యాత్ర క్యాంప్‌సైట్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు. అలాగే బరిలో నిలిచిన ఇరువురు అభ్యర్థులు ఓటు వేశారు. మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఓటు వేయగా.. కేరళలోని తిరువనంతపురంలోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఓటు వేశారు. ఇక మరోవైపు పలువురు ప్రముఖులు, సీనియర్ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీలు పి చిదంబరం, జైరాం రమేష్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓటు వేశారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పీసీసీ ప్రతినిధులు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు. కాగా సోమవారం ఉదయం ప్రారంభమైన ఎన్నిక సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here