బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని.. దేశంలోని కొన్ని విపక్షాలు కలిసి ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. కానీ, ఈ కూటమిలో ఎప్పటికప్పుడు కనిపించే లుకలుకలు ఈ కూటమి ఐకమత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే మెయిన్‌గా కనిపించే , వినిపించే ఒక ప్రశ్న కూటమిని తెలీకుండానే వేరు చేస్తుంది. ఇండియా కూటమిలో ఇప్పటికీ ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై క్లారిటీ లేదు. దీంతో ప్రధాని అభ్యర్థిపై కూటమిలో వివాదం తొలగడం లేదు. కూటమి ప్రారంభం నుంచి వివిధ పార్టీల నుంచి పీఎం అభ్యర్థుల పేర్లు తరుచూ వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపించే పేరు , ఎక్కువగా వినిపించే పేరు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనే చెప్పుకోవచ్చు. నిజానికి కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభం నుంచే నితీశ్ కుమార్ పేరు ప్రధానిగా తెరపైకి వస్తూనే ఉంది. నితీశ్ డిప్యూటీ తేజశ్వీ యాదవే.. చాలాసార్లు బహిరంగంగా ఈ విషయాన్ని లేవనెత్తారు.
కానీ కూటమి సమావేశాల్లో దీనిపై ఎక్కువగా ఎవరూ ప్రస్తావించవద్దని నేతలు నిర్ణయం తీసుకున్నా కూడా అదును చూసి ఎవరోఒకరు మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూనే ఉన్నారు . ఇలాగే ఇప్పుడు నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థంటూ జేడీయూ మరోసారి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. నితీశ్ కుమార్‌కు క్లీన్ ఇమేజ్ ఉందని, ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఆయన అయితేనే కరెక్టుగా సరిపోతారని జేడీయూ నేత, బిహార్ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు. దీనికి ముందే జేడీయూ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. లాలన్ సింగ్ కామెంట్ చేసిన వెంటనే అశోక్ చౌదరి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడిని ఉన్నత పదవిలో చూడాలని కోరుకుంటుందని, అందుకే తమ నేతని ప్రధాని మంత్రిగా చూడాలనుకుంటున్నట్లు అశోక్ చౌదరి చెప్పుకొచ్చారు.
అంతేకాదు దేశంలో ఇప్పటికిప్పుడు ప్రధాని మంత్రి అభ్యర్థిపై ఏ సంస్థ అయినా సర్వే చేస్తే.. తాము నితీశ్ కుమార్‌నే భారత ప్రధానిగా చూడాలని అనుకుంటామని చాలా మంది కోరుకుంటారని తప్పకుండా సర్వేలో వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో మాత్రమే అలా కాదని.. బయటి నుంచి కూడా ఆయనపై పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని అశోక్ చౌదరి అన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసిన అనుభవం నితీశ్ కుమార్‌కు ఉందని చెప్పారు. అంతేకాదు ఆయన 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి వరకు నితీశ్ కుమార్ మీద ఎలాంటి రీమార్క్ లేదని అశోక్ చౌదరి అంటున్నారు.
మరోవైపు ఇండియా కూటమి మూడవ సమావేశానికి ముందే నితీశ్ ఒక ప్రకటన చేశారు. తనకు పదవుల మీద ఎలాంటి కోరిక లేదని నితీశ్ అన్నారు. ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే తన కోరికని చెప్పిన ఆయన.. అదే పని చేస్తున్నట్లు నితీశ్ కుమార్ చెప్పుకొచ్చారు. అయినా కూడా నితీశ్ వర్గీయులు ఎవరో ఒకరు నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వంపై డిమాండ్‌ను తెరమీదకు తీసుకువస్తూనే ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE