హైదరాబాద్‌లోనే తొలి లైవ్ కిచెన్.. టిఫిన్స్‌ ఆన్‌ టూ వీలర్‌

Hyderabad is first live kitchen Tiffins on two wheeler,Hyderabad is first live kitchen,live kitchen Tiffins on two wheeler,Tiffins on two wheeler,Hyderabad Tiffins,Mango News,Mango News Telugu,Hyderabad's first live kitchen, Tiffins on two wheeler, Hyderabad,live kitchen, Tiffins , Two Wheeler Live Kitchen,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News

హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్‌కు ఉన్న క్రేజ్ ఎంత ఎక్కువ ఉంటుందో ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపించే రద్దీయే సాక్ష్యం. గల్లీ నుంచి బిజీ రోడ్ల వరకూ స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తే చాలు.. భోజన ప్రియులు అక్కడ క్యూ కట్టేస్తారు. ఆకలి కోసం కొందరు ఆగితే.. వాటి నుంచి వచ్చే సువాసనలకు టెంప్ట్ అయి అక్కడకు వెళ్లి తినొచ్చేవారు మరి కొంతమంది ఉంటారు. అందుకే హైదరబాద్‌లో చిన్నదో , పెద్దదో ఫుడ్ బిజినెస్ పెడితే లాభాల పంటే అన్న స్టాంప్ పడిపోయింది. స్టార్ట్ హోటల్స్, గల్లీ రెస్టారెంట్స్, వీధి టిఫిన్ అండ్ మీల్ సెంటర్స్ నంచి చివరకు ఫుడ్ ట్రక్ బిజినెస్‌లు ఎన్ని వచ్చినా వాటికి గిరాకీ కానీ, క్రేజ్ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ ముగ్గురు యువకులు మరింత క్రియేటివ్‌గా ఆలోచించి భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వేడి వేడి దోశ టిఫిన్స్‌ ఆన్‌ టూ వీలర్‌ అనే కొత్త కాన్సెప్ట్‌తో.. జీవనోపాధిని ఎంచుకున్న ఓ ముగ్గురు యువకులు ఇప్పుడు హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఆలోచించి..తాము స్వయం ఉపాధి చూసుకుంటూ భాగ్యనగరవాసుల ఆకలి అవసరాలను తీరుస్తున్నారు.
కానీ ఆ ముగ్గురు యువకులు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో లేని టూ వీలర్‌ లైవ్‌ కిచెన్‌ కాన్సెప్ట్‌తో వచ్చి మియాపూర్‌లో కనిపిస్తున్నారు. చాలామంది బైక్స్ , సైకిల్స్ పై వచ్చి టిఫిన్స్, మీల్స్ అమ్మడం చూస్తుంటాం అయితే..అవి ఇంటి దగ్గర నుంచి చేయించి తీసుకురావడంతో చల్లబడిపోతుంటాయి. కానీ వీరి దగ్గర వేడి వేడి టిఫిన్స్‌ కడుపారా లాగించేయెచ్చు. ఎందుకంటే బైక్‌కు ఫిట్ చేసిన కిచెన్‌ మీద రకరకాల దోశలను వినియోగదారుల ఎదుటే క్షణాల్లో తయారు చేసి అందిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్‌ జాతీయ రహదారి పక్కనే మూడు రోజుల కిందటే ప్రారంభించిన ఈ బైక్ లైవ్‌ కిచెన్‌ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.ఆనియన్‌ , మసాలా, ఎగ్‌, ఉప్మా దోశలను తినాలకున్నవారు ..ఇక్కడకు వెళ్తే చాలు అక్కడికక్కడే వేడివేడిగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు.సెప్టెంబర్ 11న తమ టూ వీలర్‌ లైవ్‌ కిచెన్‌ను .. మియాపూర్‌ జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు తమ లైవ్‌ కిచెన్‌ ఉంటుందని హరీశ్‌, చైతన్య, అల్తాఫ్‌ చెప్పారు. ఏ చిన్న హోటల్‌లో అయినా ప్లెయిన్ దోశ తప్ప మిగిలిన ఏ దోశ తినాలన్నా.. 50 రూపాయలు పైన చెల్లించాల్సిందే. కానీ వీళ్లు మాత్రం రూ. 25 కే ఏ టిఫిన్‌ అయినా అందిస్తున్నారు. కస్టమర్స్‌ ఎక్కడ ఉంటే అక్కడ లైవ్‌ కిచెన్‌ను ఏర్పాటు చేసేలా వీరు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కేవలం రోడ్డు పక్కనే కాకుండా చిన్న చిన్నఫంక్షన్‌లకూ కూడా తమ ‘టూ వీలర్‌ లైవ్‌ కిచెన్‌’ సర్వీసులను అందిస్తామని మెయిన్ చెఫ్‌ చైతన్య చెప్పారు.

ఈ బైక్ లైవ్ కిచెన్ గురించి వీరికి అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. హఫీజ్‌పేట్‌ , మియాపూర్‌కు చెందిన హరీశ్‌, చైతన్య, అల్తాఫ్‌ స్నేహితులు. హరీశ్‌, అల్తాఫ్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేస్తుండగా, చైతన్య మాత్రం హోటల్‌ నిర్వహణలో కొనసాగుతున్నారు.వీరికి అనుకోకుండా వచ్చిన ఈ ఐడియాను వెంటనే అమలు పరిచారు. ఉద్యోగాలు చేస్తూనే మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికోసం రోడ్డు పక్కన కనిపించే ఫుడ్ ట్రక్ బిజినెస్‌ల నుంచి టూ వీలర్ పైన తీసుకొచ్చే మీల్స్ వరకూ అన్నిటిని పరిశీలించి వారి దగ్గర సమాచారాన్ని సేకరించి చివరకు లైవ్ కిచెన్ ఐడియా బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు.

తమ సొంత ఆలోచనతో బైక్ వెనక సీటుపై లైవ్‌ కిచెన్‌‌లా వెల్డింగ్‌ చేయించారు. రెండు పొయ్యిలు, వాటిపై దోశ పెనాలను వెల్డర్ సాయంతో సెటప్ చేశారు. దీని కోసం రూ.8 వేలు మాత్రమే ఖర్చు చేశారు. వెనక సీట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దోశ పెనాలు రెండు, మరోవైపు ఇడ్లీ, వడ హాట్‌ ప్యాకులను పెట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. మొత్తంగా దీనికి వస్తున్న ఆదరణను చూసి త్వరలో సిటీ మొత్తంగా విస్తరించేలా తమకు ఆలోచన వస్తుందంటున్నారు ఈ ముగ్గురు మిత్రులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =