కరోనా నేపథ్యంలో దేశంలో మళ్ళీ లాక్‌డౌన్ ను పొడిగించిన రాష్ట్రాల వివరాలు

AP Coronavirus Lockdown, Corona Effect, Coronavirus Lockdown, Lockdown Extension, Lockdown Extension News, States which Announced Lockdown Extension, Telangana Coronavirus Lockdown

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా కరోనా కేసులు నమోదతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,906 కరోనా పాజిటివ్ కేసులు, 410 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 28, ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,28,859 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో జూన్ 30 తో దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్స్ లో విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అలాగే ఇప్పటికే అన్ లాక్ 1.0 లో భాగంగా పలు కార్యకలాపాలు మొదలయ్యాయి. అన్ లాక్ 2.0 పై ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్రాలు మళ్ళీ లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నాయి. పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతుండడంతో కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ పొడిగింపుకే రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి.

దేశంలో లాక్‌డౌన్ ను పొడిగించిన రాష్ట్రాలు:

పశ్చిమ బెంగాల్ : జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
తమిళనాడు : చెన్నై సహా 5 జిల్లాల్లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, మళ్ళీ గడువు పెంచే అవకాశమునట్టు సమాచారం.
అసోం : కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాలో జూన్ 28 అర్ధరాత్రి నుంచి రెండువారాల పాటుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్, పట్టణ, పురపాలక ప్రాంతాలలో వీకెండ్‌ కర్ఫ్యూ‌‌.
జార్ఖండ్ : జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్: కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు
తెలంగాణ: హైదరాబాద్ నగరంలో కొన్ని కీలక వ్యాపార ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు స్వచ్చంధ లాక్‌డౌన్.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here