కరోనా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాల హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా విడుదల చేసిన కేంద్రం

Central Government, Centre Released Helpline Numbers for States, Corona, Coronavirus, Coronavirus Cases, Coronavirus Effect, Coronavirus Helpline Numbers, Coronavirus Latest News, coronavirus news, Coronavirus Updates, COVID-19, COVID19 Updates, India Coronavirus, Novel Coronavirus

దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఈ పరిణామాలను జాతీయ విపత్తుగా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, వైరస్‌ నియంత్రణ కోసం చేపట్టాల్సిన పలు ప్రత్యామ్నాయాల్నీ సూచించింది. అన్నీ రకాల మాస్కులు, శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రకటించి, అవసరాలకనుగుణంగా వాటి తయారీని పెంచాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది.

తాజా సమాచారం ప్రకారం భారత్ లో 110 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా, మరో 9 మంది కోలుకున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు, సంప్రదించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్‌లైన్ నంబర్ల జాబితాను మార్చ్ 15, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్, తెలంగాణ భవన్ కమిషనర్ సంప్రదించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు : 01123382031, తెలంగాణకు 01123382041 ల్యాండ్‌లైన్‌ నెంబర్లును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా:

  • ఆంధ్రప్రదేశ్ : 0866-2410978
  • అరుణాచల్ ప్రదేశ్ : 9436055743
  • అండమాన్ & నికోబార్‌ : 03192232102
  • అసోం: 6913347770
  • బీహార్: 104
  • ఛత్తీస్‌గఢ్ : 07712235091
  • డీల్లీ : 01122307145
  • దాద్రా నగర్ హవేలి: 104
  • దామణ్‌ దీవ్‌: 104
  • గోవా: 104
  • గుజరాత్‌: 104
  • హర్యాణా: 8558893911
  • హిమాచల్ ప్రదేశ్: 104
  • జమ్మూ: 01912520982
  • ఝార్ఖండ్: 104
  • కశ్మీర్: 01942440283
  • కేరళ: 04712552056
  • కర్ణాటక: 104
  • లద్దాఖ్: 01982256462
  • లక్షద్వీప్: 104
  • మధ్యప్రదేశ్ : 0755-2527177
  • మహారాష్ట్ర: 020-26127394
  • మేఘాలయ: 108
  • మిజోరం: 102
  • నాగాలాండ్: 7005539653
  • ఒడిశా: 9439994859
  • పంజాబ్: 104
  • పుదుచ్చేరి: 104
  • పశ్చిమబెంగాల్: 3323412600
  • రాజస్థాన్: 01412225624
  • సిక్కిం: 104
  • తమిళనాడు: 04429510500
  • త్రిపుర: 03812315879
  • ఉత్తరాఖండ్: 104
  • ఉత్తర్‌ప్రదేశ్: 18001805145

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − four =