వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం – ఏపీ మంత్రి విడదల రజిని

AP Health Minister Vidadala Rajini Announces will Establish Five New Medical Colleges For Next Academic Year,AP Health Minister Vidadala Rajini,Announces will Establish,Five New Medical Colleges,Next Academic Year,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రకటించారు. ఈ మేరకు ఆమె మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో వైద్య కళాశాలలపై నిర్వహించిన సమీక్షలో భాగంగా పలు కీలక వివరను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని, ప్రతిపాదిత కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతమయ్యాయని, ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు.

ఇక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ వైద్యం అందించేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపిన మంత్రి రజిని, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీల్లో 2023 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని, ఈ క్రమంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల మేరకు ఈ ఐదు కాలేజీల్లో కావాల్సిన వసతులను వచ్చే నెలాఖరునాటికి ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఇక జిల్లాల్లోని అన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి బోధనాసుపత్రిని (మెడికల్ కాలేజీ) నోడల్ ఏజెన్సీగా చేయాలని సీఎం జగన్ ఇదివరకే నిర్ణయించారని గుర్తుచేసిన ఆమె ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − sixteen =