ఇకపై మాస్క్ లేకుంటే ఎంట్రీ కుదరదు, విమాన ప్రయాణీకులకు డీజీసీఏ నూతన మార్గదర్శకాలు

DGCA Issues New Guidelines For Air Passengers Makes Face Mask Mandatory at Airports and Inside Flights, DGCA Issues New Guidelines For Air Passengers, DGCA Makes Face Mask Mandatory at Airports and Inside Flights, Mask Mandatory at Airports and Inside Flights, Mask Mandatory at Airports, Mask Mandatory at Inside Flights, DGCA Issues New Guidelines, DGCA Issues Fresh Guidelines For Air Passengers, Face mask mandatory for air passengers, air passengers, Face mask mandatory, Directorate General of Civil Aviation, Airports and Inside Flights, DGCA New Guidelines, Mango News, Mango News Telugu,

విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఇకపై విమానాశ్రయాలు మరియు విమానాలలో ముఖానికి మాస్క్ తప్పనిసరి చేసింది. ఫేస్ మాస్క్ ధరించకపోతే లోపలకి అనుమతించబడరు. ఒకవేళ నిబంధనను ఎవరైనా దీనిని అతిక్రమిస్తే జరిమానా విధించబడుతుంది. దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా, ఏవియేషన్ రెగ్యులేటరీ బాడీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం, ఇకపై విమానంలో మాస్క్‌లు ధరించని ప్రయాణీకులను అనుమతించరు.

ప్రయాణికులందరూ ఫేస్ మాస్క్‌లు సరిగ్గా ధరించాలని మరియు ప్రయాణ సమయంలో కూడా మాస్క్ ధరించడం కొనసాగించాలని డీజీసీఏ సూచించింది. అసాధారణమైన పరిస్థితులలో మరియు అనుమతించబడిన కారణాల వల్ల మాత్రమే ఫేస్ మాస్క్‌లను తొలగించవచ్చు అని డీజీసీఏ మార్గదర్శకాలలో పేర్కొంది. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలలో అనుసరించేలా చూడాలని ఆదేశించింది. అలాగే ఈ నోటిఫికేషన్‌లో ప్రయాణీకులందరూ తమ ప్రయాణమంతా ఫేస్ మాస్క్‌ను సరిగ్గా ధరించేలా చూడాలని మరియు విమానాశ్రయాలు మరియు విమానాలలో సరైన శానిటైజేషన్‌ ప్రక్రియను చేపట్టాలని ఎయిర్‌లైన్స్ మరియు విమానాశ్రయాలను కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =