ఒకప్పుడు ఇంటి పెద్దకు బ్యాంకు అకౌంట్ ఉండటమే గొప్ప అనేట్టుగా ఉండేది. ఆ తర్వాత ఉద్యోగస్తులు మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరిచేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అకౌంట్లు ఉంటున్నాయి. అంతేకాదు ఒక్కొక్కరికి రెండు, మూడు మరికొందరికి అయితే నాలుగు, ఐదు ఖాతాలు కూడా ఉంటున్నాయి. ఒక్కోసారి ఒకరికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చనే అనుమానాలు వస్తాయి. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి.
నిజానికి ప్రతీ ఉద్యోగస్తుడికి బ్యాంకు అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు అయితే.. సంస్థలు మారుతూ ఉంటారు. చేరిన ప్రతి కంపెనీ తమ ఉద్యోగస్తుడికి ఒక్కో బ్యాంకులో ఖాతా తెరిచి ఇస్తుంది. అలా కంపెనీ మారినప్పుడల్లా బ్యాంకు అకౌంట్లు పెరిగిపోతూ ఉంటాయి. కొత్త కంపెనీకి వెళ్లాక పాత బ్యాంకు ఖాతాల గురించే మర్చిపోతుంటారు. అయితే మూడు నెలలకు పైగా వాడని జీరో బ్యాలెన్స్ అకౌంట్ బ్యాంకు ఖాతాలన్నీ..నార్మల్ సేవింగ్స్ అకౌంట్లోకి మారిపోతాయి. దాంతో వారికి తెలియకుండానే బ్యాంకులు ఇయర్లీ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు వేస్తుంటాయి.
ఒక్కో బ్యాంకును బట్టీ ఒక్కో రకంగా మినిమం బ్యాలెన్స్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటాయి. యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ వంటి బ్యాంకుల్లోరూ. 2వేలు మాత్రమే ఉంటే హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి కొన్ని బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రూ. 10వేలు మినిమం బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఒకవేళ అలా ఉంచకపోతే జీఎస్టీ కూడా యాడ్ చేసి మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు విధిస్తాయి బ్యాంకులు. కొంతమంది అది మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్ల.. అది అకౌంట్ మైనస్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎప్పుడైనా డబ్బులు అందులో వేసినా కట్ అయిపోతూ ఉంటాయి. అందుకే మినిమం బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తే ఓకే కానీ.. లేకపోతే మాత్రం వీలయినంత త్వరగా ఆ ఖాతాలు క్లోజ్ చేసుకోవాలి. లేదంటే ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అంతేకాదు ఒక బ్యాంకు అకౌంట్ ఉన్న వాళ్లకు.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నవాళ్లకు కాస్త శ్రమ అవుతుంది. ఎక్కువ మొత్తంలో డబ్బులు రొటేషన్ చేసేవారికి మాత్రం మల్టీపుల్ బ్యాంకు అకౌంట్లు ఉపయోగపడతాయి. ఒక బ్యాంకులో ఆరోజు క్యాష్ లిమిట్ అయిపోయినా ఇంకో బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. అవసరమవుతాయి. అవసరం లేకుండా ఖాతాలను క్లోజ్ చేయకుండా ఉంచితే అదనపు ఛార్జీల మోతను భరించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు తెలీకుండానే లేని పోనీ ఛార్జీలు ఇలాంటివి ఎన్ని కడుతున్నారో ఓసారి చెక్ చేసుకోండి.
కాకపోతే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండటం వల్ల ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే..బ్యాంకు అకౌంట్లో మినిమమ్ రూ. 5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా ఎఫ్డీ చేసుకోవచ్చు. కాకపోతే అనుకోకుండా ఎఫ్డీ వేసిన బ్యాంకు దివాలా తీస్తే.. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అకౌంట్ ఖాతాలో ఎంత ఎఫ్డీ మొత్తం ఉన్నా రూ.5 లక్షలు మాత్రమే తిరిగి వస్తాయి. అందుకే వేరేవేరే బ్యాంకు అకౌంట్లలో ఎఫ్డీలు వేస్తే..అంటే అన్ని అకౌంట్లలో రూ. 5లక్షల చొప్పున అలా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ ఉండటం ద్వారా మన దగ్గర అధికంగా ఉన్న మొత్తాన్ని అన్ని ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున డివైడ్ చేసి డిపాజిట్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.