కీలక విషయాలు చెప్పిన కొత్త అధ్యయనం

Does Marriage Have Anything To Do With BP, Marriage Have Anything To Do With BP, A New Study, BP, Couple BP, England, India, China, USA, Health News, Latest Health News Updates, Healthy Food, High Blood Pressure, Mango News, Mango News Telugu
marriage have anything to do with BP, A new study ,BP, couple BP,England, India, China, USA

చాలామంది పెళ్లి అయిన తర్వాతే బీపీ పెరిగిపోయిందని చెప్పడం వింటూ ఉంటాం.. కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే  తాజాగా ఈ విషయంపై  ఒక అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. దీంతో మరోసారి పెళ్లికి, బీపీకి సంబంధం ఉందా అనే చర్చ మరోసారి  తెరపైకి వచ్చింది.

తాజాగా  తెరపైకి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం వృద్ధులతో పాటు మధ్య వయసులో ఉన్నవారిలో  బీపీ ఎదుర్కొంటున్న జంటలు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్, ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్‌‌లో ‌ నిర్వహించిన తాజా పరిశోధనల్లో కొన్ని కీలక విషయాలను  వెల్లడించారు అధ్యయనకర్తలు.

పరిశోధనల ప్రకారం జీవిత భాగస్వామిలో ఏ ఒక్కరికి  బీపీ ఉన్నా.. మరొకరికి కూడా బీపీ వచ్చే అవకాశం ఉన్నట్లు   తేలింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌ లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. ఇంగ్లండ్, ఇండియా, చైనా, యుఎస్ఏ దేశాలలో సుమారు 30,000 జంటల డేటాను పరిశీలకులు పరిశోధించారు. దీంతో ఏయే దేశాల్లో జంటల పరిస్థితి ఎలా ఉందనే విషయంపై తెరపైకి వచ్చింది.

అధ్యయనం ప్రకారం ఎక్కువగా ఇంగ్లండ్ లోని జంటల్లో దాదాపు 47శాతం, యునైటెడ్ స్టేట్స్‌ లోని జంటల్లో 37.9%, చైనాలో 20.8%, ఇండియాలో 19.8శాతం జంటల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. భార్యాభర్తల మధ్య జరిగే ఆరోగ్యకరమైన సంభాషణలతో పాటు.. ఇద్దరి జీవన విధానం అనేవే  బీపీపైన గణనీయంగా ప్రభావం చూపిస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. అయితే ఇండియా, చైనా కంటే కూడా యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లండ్‌‌లో హైబీపీతో బాధపడేవారు ఎక్కువ మంది ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. అయితే భార్యభర్తల్లో హైబీపీతో బాధపడేవారి సంఖ్య మాత్రం చైనా, ఇండియాలోనే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది.

నిజానికి చైనా, ఇండియా దేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి ఉండాలనే సాంప్రదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది   వారి ఆరోగ్యంపై ప్రభావం చూపించొచ్చని అధ్యయనకర్తలు చెబుతున్నారు.   ఒకరికి ఒకరికి అన్ని విషయాల్లో సహకరించుకున్నవారిలో ఈ హైబీపీ సమస్య ఉండదని..చీటికి మాటికి గొడవలు పడుతూ,చిన్న చిన్న విషయాల్లోనూ వాగ్వాదానికి దిగేవారిలోనే బీపీ సమస్య ఉంటుందని అంటున్నారు. అయితే ఇలాంటివాటికి చెక్ పెట్టడానికి  వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =