రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ

Modi Made a Statue of Ram Lalla Alive, Statue of Ram Lalla, Modi Made a Ram Lalla Statue, Ram Lalla Statue, Ram Lalla, Ayodya, Ram Mandir, Balaram, PM Modi, Ayodya Ram Mandir News Update, Ram Mandir Pran Pratishtha, Ram Mandir Inauguration, Latest Ayodya News, Ayodya News Updates, Mango News, Mango News Telugu
Ram lalla, Ayodya, Ram Mandir, PM Modi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు కొలువుదీరారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యరక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. ఈ మహా క్రతువును కళ్లారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు.. సినీ, రాజకీయ ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు. రామనామంతో ఒక్క అయోధ్యనే  కాక.. యావత్ దేశం మారుమ్రోగిపోతోంది.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు ప్రాణప్రతిష్ట క్రతువును ప్రారంభించారు. ముందుగా ప్రధాని మోడీ బలరాముడికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరిగ్గా 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్యలో దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ట క్రతువును చేపట్టారు. ఆ సమయంలో రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో మోడీ శ్రీరాముడికి కాటుక దిద్దారు. ఆ తర్వాత రామ్ లల్లాకు అద్దాన్ని చూపించారు. అనంతరం 108 దీపాలతో రామ్ లల్లాకు మహా హారతి ఇచ్చారు. ఈ మహా హారతితో ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగిసింది.

ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో హెలికాప్టర్ ద్వారా ఆకాశం నుంచి ఆలయంపై పూల వర్షం కురపించారు. ప్రాణప్రతిష్టకు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మహోత్తరమైన ఘట్టంలో భాగమైనందుకు తనకు అంతులేని ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =