ఐపీఎల్-2023: పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్‌గా శిఖర్ ధావన్ నియామకం

IPL-2023: Shikhar Dhawan Appointed as New Captain of Punjab Kings Team, IPL-2023, Shikhar Dhawan New Captain of Punjab Kings Team, Shikhar Dhawan Punjab Kings Captain, Mango News, Mango News Telugu, Chennai Super Kings, Delhi Capitals,Gujarat Titans,Kolkata Knight Riders,Lucknow Super Giants,Mumbai Indians ,Punjab Kings,Rajasthan Royals ,Royal Challengers Bangalore,Sunrisers Hyderabad, IPL 2023 Latest News And Updates

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023కి సంబంధించి అన్ని ప్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్‌-2023 మినీ వేలం ప్రక్రియ త్వరలో జరగనుండడం, రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉండడంతో పది ఫ్రాంచైజీలు జట్టు కూర్పుపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కొత్త కెప్టెన్‌గా శిఖర్ ధావన్ ను నియమించినట్టు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన చేసింది. ఐపీఎల్-2023 నుండి పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. బుధవారం జరిగిన ఫ్రాంచైజీ బోర్డు సమావేశంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ కి ఆమోదం తెలిపారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఐపీఎల్ లో విశేషంగా రాణిస్తున్న శిఖర్ ధావన్ ను ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ కు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ తరపున శిఖర్ ధావన్ 2022 సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 460 పరుగులు చేశాడు. మరోవైపు పలు వన్డే సిరీస్ లలో భారత్ జట్టుకు కూడా శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా పంజాబ్ కింగ్స్ ఇప్పటికే 16 సీజన్లలో 14 సార్లు కెప్టెన్సీలో మార్పు చేసింది. మరోవైపు మయాంక్‌ అగర్వాల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించగా, 2023 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేస్తుందా లేక విడుదల చేస్తుందా అనేది వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 3 =