వలస ఓటర్లకు ఈసీ శుభవార్త.. ఉన్నచోటే ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ‘రిమోట్ ఓటింగ్ మెషీన్’ తయారీ

EC Develops Prototype of Remote Voting Machine For The Domestic Migrant Voters To Cast Their Votes,EC Develops Prototype,Prototype of Remote Voting Machine,Remote Voting Machine,Domestic Migrant Voters,Cast Their Votes,Mango News,Mango News Telugu,Remote Voting,Remote Voting Canada,Remote Voting System Upsc,Remote Voting Congress,Remote Voting Jobs,Remote Voting Project,Remote Voting The Hindu,Remote Voting App,Remote Voting Facility Upsc,Remote Voting Project Upsc,Congress Remote Voting,Senate Remote Voting,Secure Remote Voting System,Elections Canada Remote Voting,Secure Remote Voting System Upsc,Remote E Voting,Remote E Voting Companies Act 2013,Remote E Voting Shall Remain Open For,Remote E Voting Should Be Open For At Least,Remote E Voting Means,Remote Participation And Voting

వలస ఓటర్లకు ఎలక్షన్ కమీషన్ (ఈసీ) శుభవార్త వినిపించింది. దేశీయ వలస ఓటర్ల కోసం వినూత్న యంత్రాన్ని ఆవిష్కరించింది. సరికొత్త ఎలక్ట్రానిక్ ‘రిమోట్ ఓటింగ్ మెషీన్’ యొక్క నమూనాను అభివృద్ధి చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. కాగా మన దేశంలో ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు ఎన్నో వ్యయ,ప్రయాసలకోర్చి సొంతూళ్లకు వెల్లడం సర్వసాధారణ విషయం. ఉపాధికోసం ఇతర ప్రాంతాల్లో నివసించే వారు కేవలం ఓటు వేసేందుకై రాష్ట్రాలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ యంత్రాన్ని తయారు చేసింది. పోల్ ప్యానెల్ రిమోట్ ఓటింగ్‌పై కాన్సెప్ట్ నోట్‌ను కూడా విడుదల చేసింది. దీనిని అమలు చేయడంలో చట్టపరమైన, పరిపాలనా మరియు సాంకేతిక సవాళ్లపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరింది. ఈ క్రమంలో 2023, జనవరి 16 న దీని పనితీరుని పరిశీలించడం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.

ఇక దీనిపై ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా యువత మరియు పట్టణ ప్రజలు ఎన్నికలపై అంత ఆసక్తి ప్రదర్శించరని, ఎన్నికల ప్రజాస్వామ్యంలో వీరిని కూడా భాగం చేయడానికి ఈ రిమోట్ ఓటింగ్ ఒక పరివర్తన కార్యక్రమం అవుతుందని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా 2019 సార్వత్రిక ఎన్నికలలో కేవలం 67.4 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపిన ఆయన దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే దీనిద్వారా ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుండి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉందని, దీంతో సొంతూళ్లకు దూరంగా నివసించే ప్రజలు తాము ఉన్న ప్రాంతం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కమీషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =