కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ రిలీజ్

Release of BRS Booklet Titled Congress 420 Guarantees, BRS Booklet Titled Congress, 420 Guarantees Titled BRS, BRS Booklet, Release of BRS Bookle, Congress 420 Guarantees, Congress, BRS, Latest BRS Booklet Titled Congress 420 News, Latest BRS Booklet News, Latest BRS Booklet Update, Congress 420, Congress, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Release of BRS booklet,Congress 420 Guarantees,Congress ,BRS

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇంకా నెలరోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ రేవంత్ సర్కార్‌పై సమరశంఖం పూరించింది. ఇప్పటికే ప్రజలకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల విషయంలో ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ .. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఒక బుక్ లెట్ నే రిలీజ్ చేసింది.

తెలంగాణాలో ఎలా అయినా అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చిందని బీఆర్ఎస్ ఆ బుక్  లెట్లో వివరిస్తోంది. ఇష్టారీతిన హామీలు ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి లేదని  విమర్శించింది. ఎన్నికల్లో గెలవడం కోసమే కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను చేసిందని ఆరోపించింది.

తమ హామీల అమలుచేయడంలో జాప్యాన్ని కాంగ్రెస్‌కు గుర్తు చేయడానికే ఈ బుక్‌లెట్‌ను విడుదల చేసినట్లు బీఆర్‌ఎస్ పార్టీ చెప్పింది.  తమ మేనిఫెస్టో, ప్రకటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ  వందలాది హామీలను ప్రజలకు ఇచ్చిందని,కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ పార్టీ నేతలంతా  ఆరు హామీల గురించే మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మొత్తం 420 హామీలు ఈ బుక్‌లెట్‌లో సంకలనం చేయబడ్డాయని బీఆర్ఎస్ పేర్కొంది.

కాంగ్రెస్ 420 పార్టీ అని ఎద్దేవా చేసిన గులాబీనేతలు.. అందుకే 420 హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని మండిపడుతున్నారు. ప్రజలను మోసం చేయడంలో భాగంగానే..కాంగ్రెస్ ఇప్పటి వరకూ ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణాలో ప్రజలకు ఇచ్చిన హామీలను  లోక్ సభ ఎన్నికలు రాక ముందే నెరవేర్చాలని అంతేకాకుండా..నేతలు పదే  పదే చెబుతున్న ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికలలో ఇచ్చిన ప్రతీ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు.. దీనిప్రకారమే తమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. అంతేకాదు తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రం కాపీలను కూడా ఆ పార్టీ నేతలకు అందించి, కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని తెలపడంతో పాటు.. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం కూడా చేశారు.  అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపకపోవడంపై .. ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని కూడా భావిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =