ముగింపా? కొనసాగింపా? నేడు రైతుల కీలక నిర్ణయం

Decision on ending farmers protest, Decision To Call Off Protest Will Be Taken Today, Delhi Farmers Protest, Farmers Meeting In Delhi To Take Key Decision On Protest, Farmers Protest, Farmers Protest Against Farm Bills, Farmers Protest Against Farm Laws, Farmers Protest Against Three Farm Laws, Farmers Protest Highlights, Farmers To Take Key Decision On Protests, Mango News, Mango News Telugu, Protesting farmers likely to take decision on further action

గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో అనేక రాష్ట్రాల రైతులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగుచట్టాల రద్దు మరియు పంటకు కనీస మద్దతు ధర వంటి చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. పలు రాష్ట్రాల రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో రోజుకొక వినూత్న కార్యక్రమంతో నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఈ నిరసనలను భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ సింగ్ టికాయత్ నేతృత్వంలో రైతులు తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇంత సుదీర్ఘకాలం రైతులు సంఘటితంగా ఉండటంలో ఆయన కీలకపాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఇటీవల ఈ సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ లోక్ సభ వేదికగా ప్రకటించారు. దీంతో రైతులు ఉద్యమాన్ని ముగిస్తారని అందరూ భావించారు. అయితే రైతులు తాజాగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇన్ని రోజుల నిరసనలు తెలియజేసే క్రమంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్రం స్పందిస్తూ రైతులు నిరసన విరమిస్తే, వారి డిమాండ్లను అంగీకరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో, నిరసనలపై నిర్ణయం తీసుకోవటానికి నేడు రైతులు, రైతు సంఘాలు, రైతు ఉద్యమ నేతలు అందరూ సమావేశమవుతున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here