ప్రతి గురువారం “బస్సు దినోత్సవం” – తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Every Thursday Is Bus Day, Every Thursday Is Bus Day Telangana RTC MD VC Sajjanar, Mango News, Mango News Telugu, RTC MD Sajjanar, RTC MD VC Sajjanar, RTC officials, RTC Officials and Employees Should Travel by Bus, RTC Officials and Employees Should Travel by Bus Every Thrusday, Sajjanar, Telangana RTC, Telangana RTC MD VC Sajjanar, Telangana RTC News, Today, TSRTC Latest News, tsrtc Latest News Updates, TSRTC MD Sajjanar, tsrtc News Updates, VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి గురువారం “బస్సు దినోత్సవం” గా పాటిద్దాం అని సంస్థ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, కార్మికులు అందరూ ఇకనుంచి ప్రతి గురువారం ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని ఆదేశించారు. దీనివలన బస్సులో ప్రయాణించే సాధారణ ప్రయాణీకులతో పాటుగా సంస్థ ఉద్యోగులు కూడా కలిసి ప్రయాణించే వీలుంటుంది. ఆ సమయంలో ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకోవాలని సజ్జనార్ తమ సిబ్బందికి సూచించారు.

ఆ విధంగా ప్రయాణికుల అభిప్రాయాలను, సూచనలను తెలుసుకుని, సంస్థాగతంగా ఏవైనా లోపాలు ఉంటే మెరుగుపరుచుకుని మరింత ఉన్నతంగా ప్రజలకు సేవలను అందించే అవకాశం ఉంటుందని సిబ్బందికి తెలియజేశారు. అందుకే, ఇకపై ప్రతి గురువారం సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని చెప్పారు. దీనిని “బస్సు దినోత్సవం” గా పరిగణించాలని అధికారులకు అయన చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =