ఏపీలో కొత్త ఎక్సైజ్‌ విధానం

alcohol free state, AP Govt Announced New Excise Policy, AP Govt Announced New Excise Policy On August 21, AP Political Updates 2019, prohibited liquor shops on the road from Tirupati Railway Station to Alipiri, YCP Announces New Liquor Policy In AP, YCP Latest News, YCP Latest News 2019, YCP New Liquor Policy, YSRCP Announces New Liquor Policy, YSRCP Announces New Liquor Policy In AP, YSRCP New Liquor Policy, Yuvajana Sramika Rythu Congress Party

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 21న కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించింది. దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ప్రభుత్వం ఎక్సైజ్‌ విధానంలో మార్పులు తెచ్చింది. 2019-2020 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేసారు. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో ప్రభుత్వం మద్యం విక్రయాలు చేపట్టనుంది. కొత్త పాలసీలో ప్రభుత్వం 800 షాపులు తగ్గించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో మద్యపాన నిషేధంపై దశలవారిగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఏపీ స్టేట్ బేవరేజస్ కార్పోరేషన్స్ ఆధ్వర్యంలో 3500 మద్యం షాపులు నిర్వహించనున్నారు. ఈ మద్యం దుకాణాల లైసెన్సులు అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల మనోభావాల దృష్ట్యా, ఇకపై తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గమధ్యంలో మద్యం షాపులను ప్రభుత్వం నిషేధించింది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాల విషయంలో గతంలో సుప్రీం కోర్టు ప్రకటించిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని పాటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

 

[subscribe]
[youtube_video videoid=4rcKXfnpGeY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =