ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

French President Emmanuel Macron Has Tested Positive For COVID-19,French President Emmanuel Macron Tests Positive For COVID-19,Coronavirus,COVID-19,Emmanuel Macron,Macron Coronavirus,Macron COVID-19,World Leaders Coronavirus,World Leaders COVID-19,France Coronavirus,France COVID-19,French President,French President Coronavirus,French President COVID-19,Macron Tested Positive,Emmanuel Macron Tested Positive For COVID-19,French President Emmanuel Macron Has Tested Positive For COVID-19,French President Macron Tests Positive for COVID-19,French President,French President Emmanuel Macron,French President Macron Tested COVID-19 Positive,French President Macron Tested Coronavirus Positive,Mango News,Mango News Telugu

ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా ప్రారంభ లక్షణాలు కనిపించిన తరువాత పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఎలీసీ ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే జాతీయ కరోనా నిబంధనల ప్రకారం అధ్యక్షుడు మాక్రాన్ ఏడు రోజులు హోమ్ ఐసొలేషన్ లో ఉంటారని, అక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ వలన కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌‌ ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =