రాత్రిపూట వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ సమయంలో హజార్డ్ లైట్లను ఉపయోగిస్తున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నారు..

Using Hazard Lights While Driving in Rain,Using Hazard Lights,Hazard Lights While Driving,While Driving in Rain,Lights While Driving in Rain,Mango News,Mango News Telugu,Dont use hazard lights when its raining,Should You Turn On The Hazard Lights,Do not use hazard lights,Using Hazard Lights in the Rain,Stop flashing your hazard lights,Engine Trouble,Hazard lights,Using Hazard Lights while driving in rain, Visibility,Hazard Lights Latest News,Hazard Lights Latest Updates

అసలే ఇది వర్షాకాలం. ఎప్పుడు వర్షం పడుతుందో .. ఎలాంటి బీభత్సంగా వర్షం పడుతుందో ఎవరూ అంచనా వేయలేం. ఇటువంటప్పుడు ఫోర్ వీలర్ (Four Wheeler) నడిపినప్పుడు నడిపేవారికి చుక్కలే కనిపిస్తాయి. వర్షాకాలంలో కారు నడపడం చాలా అంటే చాలా కష్టమన్న విషయం నడిపేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇది నిజమే ఎందుకంటే దీని వెనుక రెండు బలమైన కారణాలున్నాయి. అందులో ఒకటి, వర్షం వల్ల విజిబిలిటీ (Visibility) దెబ్బతింటుంది. రెండోది ఆ సమయంలో రోడ్లు నీటితో తడిచిపోయి ఉంటాయి కాబట్టి.. కారు టైర్లు ట్రాక్షన్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా ఇంకా కొన్నికారణాలతో వర్షం పడేటప్పుడు కారు డ్రైవింగ్ (Car Driving) చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలవాటు అయిన రోడ్లు అయితే ఓకే లేదంటే అదే కొత్త రోడ్డు అయితే ఏ మాత్రం అవగాహన ఉండదు. రెగ్యులర్‌గా వెళ్లే రోడ్లపైనే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటిది కొత్త రోడ్లు అందులోనూ వర్షం వల్ల కనిపించని గుంతలు, స్పీడ్ బ్రేకర్ల (Speed Breakers)తో మరింత ఇబ్బంది పడతారు. ఉదయం అయితే ఓకే కానీ రాత్రి వేళలో వర్షం పడుతుండగా కారు నడిపితే మాత్రం ఆ కష్టం నడిపేవాడికి తప్ప పక్కవాళ్లకు చెప్పినా అర్ధం కాదు. అందుకే ఇలాంటి సమయంలో చాలామంది కారులోని హజార్డ్ లైట్ల (Hazard lights)ను ఆన్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉండడటం చాలాసార్లు గమనిస్తాం.

ఎందుకంటే తాము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విజిబిలిటీ వల్ల హజార్డ్ లైట్లను ఆన్ చేస్తే.. తమతో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనదారులకు ఇది మంచిది అనుకుంటారు. ఆ లైట్ల వల్ల వారికి తాము తెలియకుండానే సహాయం చేస్తున్నామనే అవగాహన లేని ఆలోచనతో ఇలా చేస్తారు. అయితే ఇది అస్సలు మంచిది కాదట. నిజానికి మీరు హజార్డ్ లైట్స్ ఆన్ చేసి.. డ్రైవింగ్ చేయడం వల్ల వేరే వ్యక్తులకు రాంగ్‌ మెసేజ్ (Wrong Message) ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాదు వర్షం వల్ల ఇంజన్ ట్రబుల్ (Engine Trouble) ఇచ్చో.. లేక వేరే ఇతర కారణాల వల్ల మీ కారు రోడ్డు పక్కన ఆపాల్సి వచ్చినప్పుడు హజార్డ్ లైట్స్ ఆన్ చేస్తారు.

కానీ ఇది అన్ని సమయాలలోనూ మంచిది కాదట. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికి సాయం చేద్దామన్నా ఆలోచన ఉన్నవారు తక్కువ మంది ఉంటారు. అందులోనూ వర్షంలో రిస్క్ తీసుకుని మీకు సాయం చేయడానికి చాలామంది ఇష్టపడరు. పైగా.. చెడు ఆలోచనలతో ఉన్నవారికి అక్కడ మీరు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నారనే సందేశాన్ని మీరే హజార్డ్ లైట్స్ సాయంతో ఇచ్చినట్లు అవుతుంది. దీంతో అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షం పడితే పొరపాటున కూడా హజార్డ్ లైట్లు ఆన్ చేయకండి. ఒకవేళ విజిబిలిటీ కోసం కారు హెడ్ లైట్స్ వెలుగులు సరిపోతాయి. దీంతో పాటు కారు వెనుక లైట్లు కూడా ఆన్ అవుతాయి. కాబట్టి మీ వెనుక వచ్చిన వాహనదారులు వారి ముందు ఓ వెహికల్ ఉందని అర్ధం చేసుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =