విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేష‌న్‌ వేసిన య‌శ్వంత్ సిన్హా.. హాజరైన రాహుల్, ప‌వార్, కేటీఆర్, అఖిలేష్

Presidential Polls 2022 Rahul Pawar KTR Akhilesh Attends For The Nomination of Yashwant Sinha, Presidential Polls 2022 Akhilesh Attends For The Nomination of Yashwant Sinha, Presidential Polls 2022 Rahul Attends For The Nomination of Yashwant Sinha, Presidential Polls 2022 Pawar Attends For The Nomination of Yashwant Sinha, Presidential Polls 2022 KTR Attends For The Nomination of Yashwant Sinha, Nomination of Yashwant Sinha, Presidential Polls 2022, Rahul, Pawar, KTR, Akhilesh, KTR will Attends To Represent TRS, Minister KTR will Attends To Represent TRS, Yashwant Sinha To Files Nomination Today, Presidential Polls 2022, 2022 Presidential Polls, Presidential Polls, Yashwant Sinha, Presidential Candidate Yashwant Sinha, Presidential Candidate, Candidate Yashwant Sinha, Minister KTR, Presidential Polls 2022 News, Presidential Polls 2022 Latest News, Presidential Polls 2022 Latest Updates, Presidential Polls 2022 Live Updates, Mango News, Mango News Telugu,

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీకి అధినేత శరద్ పవార్, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున్‌ ఖర్గే, జైరాం రమేశ్‌, ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ వెంట మరికొంతమంది టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. కాగా జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశారు. సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్న వాటిలో.. టీఎంసీ, కాంగ్రెస్, సిపిఐ, శివసేన, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీ, ఆర్ఎల్డి, పీడీపీ మరియు ఎంఐఎం తదితర పార్టీలు ఉన్నాయి. మరోవైపు అధికార బీజేపీ తమ భాగస్వామ్య పక్షాల ఎన్డీయే అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ముని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముర్ము జూన్ 24న నామినేషన్ వేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =