గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన

Pawan Kalyan,Pawan competition from Bhimavaram?,Janasena, Godavari districts,TDP, YCP, AP latest News, Cpi, Cpm, Bhimavaram, Gajuwaka, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Pawan Kalyan,Pawan competition from Bhimavaram?,Janasena, Godavari districts,TDP, YCP, Janasena, Cpi, Cpm,

ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన పవన్.. త్వరలో రానున్నఎన్నికలలో ఎలా అయినా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి  పోటీ చేస్తారని  ప్రచారం జోరుగా జరుగుతోంది. ఫిబ్రవరి 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ టూర్ ప్లాన్ చేసుకున్నారు. పవన్‌ మొదటి ప్రచారం భీమవరం కావడంతో అక్కడ్నించే పవన్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది.

పవన్‌ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, టూర్ ఎండింగ్‌లో రాజమండ్రిలో జనసేనాని పర్యటన ఉంటుంది. పవన్‌ టూర్‌ షెడ్యూల్‌లో ముందుగా భీమవరాన్ని ఎంచుకోవడంతో, అక్కడ్నించే పవన్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం స్పీడందుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని  భీమవరం మొదటి నుంచీ కూడా రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గమన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో  పవన్ కళ్యాణ్‌ భీమవరం నుంచి పోటీ చేయగా..వైసీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్‌….పవన్‌ను ఓడించారు. టీడీపీ అభ్యర్థి అయిన పులపర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2019  ఎన్నికలలో పోటీ చేసిన ఈ ముగ్గురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా, పవన్‌ కళ్యాణ్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. 8,357 ఓట్ల తేడాతో పవన్ ఓడిపోవడం హాట్ టాపిక్ అయింది.

అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. వైసీపీపై పూర్తిగా నెగిటివిటీ పెరిగిపోయి పవన్‌పై సానుకూల పవనాలు వీస్తున్నాయి. దీనికి తోడు  పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీ  చేస్తే ఈసారి కచ్చితంగా గెలిపించుకుంటామని జనసేన నాయకులు బలంగా చెబుతున్నారు. దీంతో పవన్ అక్కడ నుంచే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. గత ఎన్నికలలో పరాజయం పొందిన తర్వాత కూడా భీమవరం వచ్చిన జనసేనాని బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఇప్పుడు మరోసారి పవన్‌ భీమవరం వెళ్లనున్న పవన్..ఇక్కడ కొంతమంది ప్రముఖులను, నేతలను కలవనున్నారు. దీంతో భీమవరంలో మళ్లీ పోటీ చేసే వ్యూహంతోనే   పవన్‌ పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.భీమవరంలో మొత్తంగా 2,51,301 ఓట్లు ఉన్నాయి. ఇందులో 5 వేల వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన  7  ఓటర్లు ఉంటారు. ఇక్కడ బీసీ ఓటింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సారి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లడానికి  జనసేన నేతలు ప్లాన్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twelve =