గూగుల్ కీలక ప్రకటన చేసింది. ‘బార్డ్’ అనే పేరుతో కొత్త ప్రయోగాత్మక కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ఏఐ) చాట్‌బోట్‌ను పరిచయం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత చాట్‌జీపీటీకి పోటిగా దీనిని లాంచ్ చేయనుంది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ బార్డ్ గురించి వివరిస్తూ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఇలా వ్రాశారు.. ‘బార్డ్ మన పెద్ద భాషా నమూనాల శక్తి, తెలివి మరియు సృజనాత్మకతతో ప్రపంచ జ్ఞానం యొక్క విస్తృతిని కలపడానికి ప్రయత్నిస్తుంది. బార్డ్ సృజనాత్మకతకు ఒక అవుట్లెట్ మరియు ఉత్సుకతకు లాంచ్‌ప్యాడ్’ అని పేర్కొన్నారు. అలాగే ‘మేము రాబోయే వారాల్లో బార్డ్‌ని మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచుతాము మరియు దానిని మెరుగుపరుస్తాము’ అని కూడా చెప్పారు.
2/ Bard seeks to combine the breadth of the world’s knowledge with the power, intelligence, and creativity of our large language models. It draws on information from the web to provide fresh, high-quality responses. Today we’re opening Bard up to trusted external testers. pic.twitter.com/QPy5BcERd6
— Sundar Pichai (@sundarpichai) February 6, 2023
కాగా గతేడాది నవంబర్ చివరిలో విడుదలైన శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ ఓపెన్ ఏఐచే సృష్టించబడిన చాట్‌జీపీటీ, కేవలం సెకన్ల వ్యవధిలోనే వినియోగదారుల అవసరార్ధం వ్యాసాలు, పద్యాలు లేదా ప్రోగ్రామింగ్ కోడ్‌ను వ్రాయగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ గత నెలలో దీనికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా మైక్రోసాఫ్ట్ బిలియన్ల డాలర్లను ఈ కొత్త అప్లికేషన్ కోసం వెచ్చించనుంది. అలాగే చాట్‌జీపీటీ ఫీచర్లను దాని టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభించింది. ఇది యాప్‌ను తన ఆఫీస్ సూట్ మరియు బింగ్ సెర్చ్ ఇంజన్‌కు అనుగుణంగా మారుస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ చాట్‌జీపీటీ కేవలం రెండు వారాల వ్యవధిలోనే 100 మిలియన్ యూజర్లను ఆకట్టుకుందని ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రముఖ పోటీదారు అయిన గూగుల్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్ అనే కొత్త ఏఐ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
బార్డ్ వలన దినసరి జీవితంలో కొన్ని ఉపయోగాలు..
- ‘బార్డ్’ గూగుల్ యొక్క లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ సిస్టమ్ పైన ఆధారపడి పనిచేస్తుంది.
- యూజర్లు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన, స్పష్టమైన తాజా సమాచారాన్ని అందిస్తుంది.
- దీనికోసం వెబ్ నుండి సమాచారాన్ని తీసుకుంటుంది.
- పార్టీని ప్లాన్ చేయడానికి చిట్కాలను అందించడం లేదా రిఫ్రిజిరేటర్లో మిగిలి ఉన్న ఆహారాన్ని బట్టి లంచ్ ప్రిపరేషన్ వంటి వాటిలో సహాయ పడుతుంది.
- ఈ చాట్‌బోట్ అత్యంత క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణల విషయాలను పిల్లలకు అర్థమయ్యేంత సరళంగా వివరించగలదు.
- చాట్‌జీపీటీ 2021 వరకు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా సమాధానాలు ఇవ్వనుండగా.. బార్డ్ మాత్రం ఆన్లైన్లో ఉండే తాజా సమాచారాన్ని కూడా విశ్లేషించి సమాధానాలు ఇస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE