సీఎం వైఎస్‌ జగన్‌ ను కలిసిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి

Chess Player Kolagatla Alana Meenakshi Met AP CM YS Jagan at Camp Office,Kolagatla Alana Meenakshi,Alana Meenakshi Chess,Meenakshi Subbaraman Chess,Indian Chess Players Young,Youngest Indian Chess Grandmaster,No 1 Chess Player In The World,74Th Chess Grandmaster Of India,Chess Player Name,75Th Grandmaster Of India,Indian Chess Players Ranking,Chess Grandmaster List In India,Famous Chess Player In India,Top 10 Chess Players In India,Female Chess Players In India,Top 10 Chess Players In World,Chess Players From Andhra Pradesh,Can Chess Players Talk To Each Other,Characteristics Of Chess Players,Chess Rating App,Andhra Pradesh Chess Players

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సోమవారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి క‌లిశారు. ఈ సందర్భంగా మీనాక్షిని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. అలాగే మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్‌గా రూ.1 కోటి నిధిని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మీనాక్షి రికార్డులు నెలకొల్పింది. ఇటీవలే రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 పురస్కారాన్ని మీనాక్షి అందుకుంది.

వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 12 గర్ల్స్‌ చెస్‌ 2023 (ఫిడే ర్యాంకింగ్స్‌), వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 11 గర్ల్స్‌ చెస్‌ 2022, వరల్డ్‌ నెంబర్‌ 2 అండర్‌ 10 గర్ల్స్‌ చెస్‌ డిసెంబర్‌ 2021, ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ 2022, ఉమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ 2021 టైటిల్స్‌ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని మీనాక్షి, ఆమె తల్లిదండ్రులు సీఎంతో పంచుకోగా, మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ హామీ. ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో మీనాక్షితో పాటుగా ఆమె తల్లిదండ్రులు డాక్టర్‌ అపర్ణ, మధు ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =