మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు

Kusukuntla Prabhakar Reddy Takes Oath as Munugode MLA Today, Prabhakar Reddy Oath For Munugode MLA, Munugode MLA Kusukuntla Prabhakar Reddy, Kusukuntla Prabhakar Reddy, Mango News,Mango News Telugu, Munugode Election Latest News And Updates, Munugode Election Schedule Release, Telangna BJP Party, Telangna Congress Party, TRS Party Candidate Kusukuntla Prabhakar Reddy, TRS Working President KTR,Munugode By-Poll, YSRTP

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు (నవంబర్ 10, గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కుటుంబసభ్యులు పాల్గొని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ముందుగా నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మునుగోడులో ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి 97006 (42.95 శాతం), బీజేపీకి 86697 (38.38 శాతం), కాంగ్రెస్ కు 23,906 (10.58 శాతం) ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ అనంతరం మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలోనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here