కర్ణాటక హిజాబ్ వివాదంపై అగ్రరాజ్యం స్పందన.. ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని కౌంట‌ర్ ఇచ్చిన భారత్

Hijab Row Motivated Comments on India’s Internal Issues Not Welcome Says MEA, Hijab Row, Motivated Comments on India’s Internal Issues, MEA, MEA Says Motivated Comments on India’s Internal Issues, Karnataka Hijab Row Issue, Karnataka Hijab Row Issue Latest News, Karnataka Hijab Row Issue Latest Updates, Karnataka Hijab Row Issue Live Updates, Mango News, Mango News Telugu, India’s Internal Issues, Hijab Row Issue, Ministry of External Affairs, Ministry of External Affairs Says Motivated Comments on India’s Internal Issues, External Affairs,

భారతదేశ అంతర్గత సమస్యలపై ఇతర దేశాలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలు స్వాగతించబడవు అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటించారు. కాగా, కర్ణాటకలోని ఒక కళాశాలలోకొన్నిరోజులక్రితం హిజాబ్ ధారణపై మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా దీనిలో తలదూర్చింది. అమెరికా రాయబారి, ప్రభుత్వ సీనియర్ అధికారి రషద్ హుస్సేన్ అంతర్జాతీయంగా మత స్వేచ్ఛ కోసం అంటూ కర్ణాటక హిజాబ్ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే, దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది.

న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని అమెరికా, మిగిలిన ఇతర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మతపరమైన స్వేచ్ఛలో తమకు నచ్చిన మతపరమైన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని అరిందమ్ బాగ్చీ కూడా తన ప్రకటనలో స్పష్టం చేశారు. “కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్‌కు సంబంధించిన అంశం కర్ణాటక హైకోర్టు న్యాయ పరిశీలనలో ఉంది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. పరిపాలన మరియు ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి హైకోర్టు పరిష్కరిస్తుంది” అని అరిందమ్ బాగ్చి అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 7 =