విశాఖ ఉక్కు కార్మికుల సంకల్పానికి ఉద్యమాభివందనాలు – నారా లోకేష్

Nara Lokesh Salutes For The Will Of Workers Over Visakhapatnam Steel Plant Movement, Nara Lokesh Salutes For The Will Of Workers, Nara Lokesh, Visakhapatnam Steel Plant Movement, Will Of Workers Over Visakhapatnam Steel Plant Movement, Telugu Desam Party, TDP, Visakhapatnam Steel Plant, Visakhapatnam Steel Plant Latest News, Visakhapatnam Steel Plant Latest Updates, Nara Lokesh Salutes Visakhapatnam Steel Plant Workers, Visakhapatnam Steel Plant Workers, Visakhapatnam Steel Plant Workers Will Power, Mango News, Mango News Telugu, Steel Plant,

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒక సంవత్సర కాలంగా అలుపెరగకుండా ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ నినదిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఈ సందర్భంగా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. అయితే, ఇంత పెద్ద ఎత్తున విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు ఉద్యమం నిర్వహిస్తున్నా ఏపీ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని.. పార్లమెంట్‌ వరకు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నామని లోకేశ్‌ తెలిపారు.

కానీ, విశాఖ ఉక్కు గురించి ఏపీ సీఎం జగన్ కానీ, పార్లమెంట్‌లో వైసీపీ పార్టీ ఎంపీలు కానీ మాట్లాడడం లేదని నారా లోకేష్ మండిపడ్డారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల ఉక్కు సంకల్పం చూసైనా విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయడాన్ని కేంద్రం విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పాటై, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కుని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని నారా లోకేష్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =