ఎడ్జ్‌బాస్టన్‌లో ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ : భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్ల జాబితా ఇదే…

IND vs ENG 5th Test England Announce 15 Member Squad and Mayank added to India’s Squad, England Announce 15 Member Squad and Mayank added to India’s Squad, Mayank added to India’s Squad, England Announce 15 Member Squad, 15 Member Squad, IND vs ENG 5th Test England Squad, IND vs ENG 5th Test India Squad IND vs ENG 5th Test, England announce 15 man squad for the 5th rescheduled Test match against India, 5th rescheduled Test match against India, England Team Announces 15-Member Squad For Fifth Test Against India, Fifth Test Against India, Mayank Added to India Test Squad Against England as Back-Up For Rohit Sharma, IND vs ENG 5th Test News, IND vs ENG 5th Test Latest News, IND vs ENG 5th Test Latest Updates, IND vs ENG 5th Test Live Updates, Mango News, Mango News Telugu,

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1 నుంచి 5 వరకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదవటెస్టులో భారత్ తో తలపడే 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) సోమవారం నాడు విడుదల చేసింది. న్యూజిలాండ్‌ తో జరిగిన మూడో టెస్టు జాబితాలో ఉన్న 14 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు నిలబెట్టుకోగా, వికెట్ కీపర్ బ్యాటర్ సామ్ బిల్లింగ్స్ కొత్తగా జట్టులో చేర్చబడ్డాడు. న్యూజిలాండ్‌ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు సామ్ బిల్లింగ్స్ రిజర్వ్ ఆటగాడిగా ఉండగా, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కి కోవిడ్-19 పాజిటివ్ గా తేలడంతో భారత్ తో టెస్టుకు సామ్ బిల్లింగ్స్ కు అవకాశం లభించింది.

మరోవైపు భారత్ జట్టులో కూడా ఓ మార్పు చేయబడింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో అతనికి కవర్‌గా ఇంగ్లాండ్ తో ఐదవ టెస్ట్ కోసం ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ను భారత టెస్ట్ జట్టులో చేర్చింది. మయాంక్ ఇప్పటికే యూకేకు బయలుదేరాడని, బర్మింగ్‌హామ్‌లోని టెస్టు జట్టుతో కలవనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ పై 3 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ ఊపుమీదుండగా, ఈ టెస్టులో సత్తాచాటి సిరీస్ గెలుచుకునేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. అలాగే కీలకమైన ఎడ్జ్‌బాస్టన్ టెస్టు తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

ఇంగ్లాండ్ టెస్టు జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, జామీ ఓవర్టన్, ఒల్లీ పోప్, మ్యాటీ పాట్స్.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =