మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

Minister Talasani Srinivas Yadav Demands For Bharat Ratna Should be Given To Ex-PM PV Narasimha Rao, Telangana Minister Talasani Srinivas Yadav Demands For Bharat Ratna Should be Given To Ex-PM PV Narasimha Rao, Talasani Srinivas Yadav Demands For Bharat Ratna Should be Given To Ex-PM PV Narasimha Rao, Bharat Ratna Should be Given To Ex-PM PV Narasimha Rao, Ex-PM PV Narasimha Rao, Bharat Ratna For Ex-PM PV Narasimha Rao, Bharat Ratna, PM PV Narasimha Rao, PV Narasimha Rao, Former PM PV Narasimha Rao, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Telangana Minister for Animal Husbandary, Telangana Minister Fisheries and Cinematography, Fisheries and Cinematography, Mango News, Mango News Telugu,

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రి తలసాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ నరసింహా రావు మన తెలంగాణ ముద్దు బిడ్డ అని, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దేశానికే ప్రధానమంత్రి అయ్యారని పేర్కొన్నారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఎంతో ముందుచూపుతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని, ఆయన సాహసోపేత నిర్ణయాలవల్లే తదనంతర కాలంలో దేశం అభివృద్ధిపథంలో పయనించిందని మంత్రి కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకుని కేంద్రం ఆయనను ‘భారతరత్న’ అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీవీ శతజయంతి సందర్భంగా సంవత్సరకాలం వేడుకలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం ఆయనను గౌరవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 19 =